ఆయిల్ పుల్లింగ్ వల్ల 9 అద్భుతమైన ప్రయోజనాలు

ఆయిల్ పుల్లింగ్
Share

కొన్ని చిన్న చిన్న పనులు మన జీవితానికి గొప్ప విలువను తీసుకువస్తాయి.  కొన్నిసార్లు అవి చాలా తేలికగా ఉండడం వల్ల మనం వాటిని పట్టించుకోము. అలాంటిదే ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ పురాతన ఆయుర్వేద సాధన. దీనివలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  ఇది చేయడం చాలా తేలిక మరియు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఈరోజు ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి ? దాని వలన ఉపయోగాలు ఏమిటి అనేది చూద్దాం.

ఆయిల్ పుల్లింగ్ ఎలా సాధన చేయాలి ?

పరగడుపున ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని నోట్లో 10 నుంచి 20 నిమిషాలు పుక్కిలిస్తూ ఉండాలి. ఉదయం మీరు బ్రష్ చేసుకునే ముందు ఇది చేయాలి. ఆయిల్ పుల్లింగ్ చేయడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మొదట 5 నిమిషాలతో మొదలుపెట్టి క్రమేపీ 20 నిమిషాల వరకు పెంచుకుంటూ వెళ్ళండి.

2. ఆ ఆయిల్ ని మింగకూడదు. కాసేపు నోట్లో పుక్కిలించిన తర్వాత అది మన నోట్లో ఉన్న వ్యర్థ పదార్థాలను సేకరిస్తుంది. కాబట్టి దానిని మింగకూడదు. వాష్ బేసిన్ లో కానీ లేదా టాయిలెట్లు కానీ ఉమ్మకండి. ఇది డ్రెయిన్ ని అడ్డుకోవచ్చు.  డస్ట్ బిన్ లో ఉమ్మండి.

3. ఆయిల్ పుల్లింగ్ కేవలం పరగడుపున మాత్రమే చేయాలి.

4. మీరు ఎలాంటి నూనె అయిన వాడవచ్చు. కొబ్బరి నూనె లేదా వేరుశెనగ నూనె, నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్. కానీ మీరు వాడుతున్న ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయి ఉండాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లో హానికర రసాయనాలు ఉండవు.

5. రిఫైన్డ్ ఆయిల్ లో చాలా హానికర రసాయనాలు ఉంటాయి. ఆయిల్ పుల్లింగ్ చేసేది మన నోట్లో ఉన్న విషపదార్థాలను తీసివేయడానికి.  మనం రిఫైన్డ్ ఆయిల్ వాడితే ఆయిల్ పుల్లింగ్ వెనుక ఉన్న ఉద్దేశమే పోతుంది.  కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ వాడకండి .

6. ప్రతి ఆయిల్ కి తన తనదైన ఒక ప్రత్యేకత మరియు ప్రయోజనాలు ఉంటాయి. చాలామందికి కొబ్బరి నూనె యొక్క రుచి నచ్చుతుంది.  కాబట్టి కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం తేలిక.  అంతేకాకుండా కొబ్బరి నూనెకి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్,  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.  కాబట్టి కొబ్బరి నూనె వాడడం మరింత శ్రేయస్కరం. కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె ఇక్కడ పొందవచ్చు. 

7. ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు నడుస్తూ లేదా ఏదైనా పుస్తకం చదువుతూ లేదా ఇంట్లో పనులు చేసుకుంటూ చేయండి.

8. ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు ఆ ఆయిల్ కి, పిప్పర్ మింట్, లేదా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కలపడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది.

ఆయిల్ పుల్లింగ్ ఎలా పనిచేస్తుంది ?

ఆయిల్ పుల్లింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.  ఉపయోగాలు తెలుసుకునే ముందు అసలు ఆయిల్ పుల్లింగ్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.  మన ఆరోగ్యం విషయంలో నోరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన నోటిని మరియు పళ్ళని ఉపయోగించి మన ఆహారం తీసుకుంటాం. మన నోటిలో పసుపు రంగు పాచి తయారవుతుంది.  దీనిలో బ్యాక్టీరియా, మ్యూకస్ ఆహార పదార్థాల అవశేషాలు ఉంటాయి. సాధారణంగా మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఇవి పోతాయి. కానీ మన పళ్ళ సందుల్లో కొన్ని ఉండిపోతాయి. కాబట్టి బ్రష్ చేయడం వల్ల ఇవి పూర్తిగా పోవు.

ఈ పాచి మన నోటిలో ఉండిపోతే విష పదార్థంగా మారుతుంది.  మరియు బ్యాక్టీరియా,  వైరస్ ఇలాంటి వాటికి ఇల్లులా తయారవుతుంది. ఇది మనం తినే ఆహారంతో కలిసి లోపలికి వెళ్లి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. మన శరీరం యొక్క శక్తి ఇది తీసుకు వచ్చిన హానికర పదార్థాలతో పోరాడడానికి సరిపోతుంది.

ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటిలో పేరుకుపోయిన ఈ వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకు వస్తుంది. ఆయిల్ చిక్కగా అంటుకునేలా ఉండడం వల్ల ఇది ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. విష పదార్థాలు మరియు కొవ్వు పదార్థాలు ఆయిల్లో కరిగిపోతాయి. నోటిలో ఎలాంటి విష పదార్థాలు లేకుండా చూసుకుంటే మనం తినే ఆహారం స్వచ్ఛంగా లోపలికి వెళుతుంది. బాక్టీరియాతో పోరాటం కాకుండా మన శరీరం మిగిలిన ముఖ్యమైన పనుల మీద దృష్టి సారిస్తుంది. ఈ విధంగా ఆయిల్ పుల్లింగ్ పనిచేసి మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తుంది.

ఆయిల్ పుల్లింగ్ యొక్క 9 లాభాలు.

ఆయిల్ పుల్లింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి.  ఇది ప్రతి రోజూ మీ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  ఆయిల్ పుల్లింగ్ తరచు చేసేవారు పొందే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. నోటి యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది : బలమైన మరియు ఆరోగ్యకరమైన పళ్ళు ఉండటం చాలా ముఖ్యం. దీనికి ఆయిల్ పుల్లింగ్ చాలా సహాయపడుతుంది. పళ్ళు తెల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. పంటి చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

2. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది : నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నోటి దుర్వాసనకి చాలా రకాల కారణాలు ఉన్నా నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం ప్రధాన కారణం. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

3. ఒంటి నొప్పులు తగ్గిస్తుంది : ఆయిల్ పుల్లింగ్ వల్ల పంటి నొప్పులు తగ్గుతాయని తేలింది. ఆర్థరైటిస్ తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరం. కీళ్ళవాపు, ఎముకల వాపును తగ్గిస్తుంది.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది : ఆయిల్ పుల్లింగ్ మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తక్కువ విషపదార్థాలు ఉండడం వల్ల మన శరీరానికి పోరాడే శక్తి పెరుగుతుంది. ఫ్లూ మరియు వైరస్ ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం.

5. మైగ్రేన్ తగ్గిస్తుంది : మైగ్రేన్ తో బాధపడేవారికి ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన చాలా ఉపశమనంగా ఉంటుంది.

6. మంచి జీర్ణశక్తి : ఎలాంటి విష పదార్థాలు లేకుండా ఆహారం మన కడుపు లోనికి వెళ్లి నప్పుడు సరిగా జీర్ణం అయ్యి మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

7. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది : మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల వల్ల మన చర్మం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విష పదార్థాలు తగ్గినప్పుడు చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కాంతివంతమైన మచ్చలు లేని చర్మం వస్తుంది.

8. నిద్ర బాగా పడుతుంది : ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందని తేలింది.

9. మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ఆయిల్ పుల్లింగ్ చేయడంవల్ల మన శరీరంలో రోజు పేరుకుపోయే విషపదార్థాలు తగ్గిపోవడం వల్ల మన శరీరం యొక్క ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. శక్తి పెరుగుతుంది.  వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.  జీర్ణశక్తి పెరుగుతుంది.  వీటన్నిటి వల్ల మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం.

ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కలిగే 9 ప్రయోజనాలు ఇవి.

1996లో ఆయిల్ పుల్లింగ్ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి చేసిన సర్వేలో ఒక 1041 మంది పాల్గొన్నారు. ఆయిల్ పుల్లింగ్ చేయడంవల్ల ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రోగాలనుండి బయటపడ్డారని ఈ సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది చెప్పారు. ఏ కేసులో,  ఎలా లాభం పొందారో ఇప్పుడు చూద్దాం.

1. ఒంటి నొప్పులు – 758 కేసులు

2. అలా చి మరియు ఆస్తమా వంటి శ్వాస సమస్యలు – 191 కేసులు

3. చర్మ సమస్యలు – 171

4. జీర్ణ సమస్యలు – 155 కేసులు

5. మలబద్ధకం – 110 కేసులు

6. గుండె ఆరోగ్యం – 74 కేసులు

ఈ సర్వే లో  ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తేలింది. పాల్గొన్నవారిలో 89 శాతం మంది వారికి ఆయిల్ పుల్లింగ్ ఏదో ఒక ఉపయోగం జరిగిందని చెప్పడం చాలా పెద్ద సంఖ్య.

ఆయిల్ పుల్లింగ్ చాలా తక్కువ సమయంలో చేయగలిగిన ఆరోగ్యకరమైన సాధన.  దీనిని ఎవరైనా ఇంటి వద్దనే నూనెతో ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు.  ప్రతిరోజు మార్నింగ్ ఆయిల్ పుల్లింగ్ చేయడం అలవాటు చేసుకుని ఎన్నో ప్రయోజనాలు పొందండి.

Registration

Forgotten Password?

Loading