Facebook, instagram, twitter, whatspp మనకి ఇష్టం ఎందుకంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉండదాన్ని ఇవి తేలిక చేశాయి. మన గురించి మనం ప్రపంచానికి చెప్పుకోడానికి, అవతలి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, కొత్త స్నేహితులని ఏర్పరచుకోవడానికి, మన టాలెంట్ ప్రపంచానికి చూపించడానికి మనకి చాలా సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. అవి మన జీవితంలో భాగం అయిపోయాయి. అన్నిటిలాగానే ఇందులో కూడా రెండు కోణాలు ఉన్నాయి. పాజిటివ్ మరియు నెగెటివ్. ఎలా వాడుకోవాలి అనేది వాడే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సోషల్ మీడియాను పాసిటివ్ గా వాడుకుని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను ఎలా మెరుగుపరచుకోవాలో ఈ రోజు చూద్దాం.
సోషల్ మీడియా ను సానుకూలంగా ఉపయోగించడానికి 9 చిట్కాలు
1. సోషల్ మీడియా వాడే సమయానికి లిమిట్ పెట్టుకోండి: అన్ని పోస్ట్ లు చదవడం, చాట్ చెయ్యడం, వీడియోలు చూడడం బావుంటుంది. కానీ సోషల్ మీడియా చూసే సమయాన్ని తగ్గించుకోండి ఎందుకంటే దానికి అంతా సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పరీక్షలు రాయాలి, పనిచేయాలి, మీ కుటుంబాన్ని చూసుకోవాలి. ఎక్కువగా సోషల్ మీడియాలో గడపడం వల్ల మీ పనిలో నాణ్యత తగ్గుతుంది. మీ శక్తి వృధాగా పోతుంది. మీ ఏకాగ్రత పోతుంది. ఏమీ చెయ్యకుండానే అలసిపోతారు. మీ లక్ష్యాలను సాధించలేరు. మీ ర్యాంకులను, పనిలో మీ ఉన్నతిని, ఫ్యామిలీతో మీరు గడిపే సమయాన్ని ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి.
2. తెలియని వాళ్ళతో సోషల్ మీడియాలో స్నేహం చెయ్యకండి: తెలియని వాళ్ళ దగ్గర చాకొలెట్స్ , బిస్కెట్స్ తీసుకోవద్దని చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు. ఇదే సోషల్ మీడియాకి కూడా వర్తిస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ ఎంత గొప్పగా ఉన్నా తెలియని వాళ్ళ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ accept చెయ్యకండి. టెర్రరిస్ట్ లు, మోసగాళ్ళు మంచి వాళ్ళలా ముసుగు వేసుకుని ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సోషల్మీడియలో వ్యక్తుల్ని నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు , చెడ్డవాళ్లని పెళ్ళి చేసుకున్న వాళ్ళు, లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఉండగా మీ రక్షణ మాత్రమే ముఖ్యం.
3. మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చుకోకండి: సోషల్ మీడియాలో మోసం చెయ్యడం చాలా తేలిక. ఒక వ్యక్తి పెళ్ళి ఎన్నో సమస్యలు పడి ఉండొచ్చు కానీ మంచి ఫోటో పెట్టొచ్చు. ఇందులో చూసే వాటిని, వినే వాటిని మీ జీవితంతో పోల్చకండి. Like చెయ్యండి, Comment చెయ్యండి, share చెయ్యండి కానీ ప్రతీ మనిషికి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయని గుర్తుంచుకోండి. మీలాగే అందరి జీవితంలో బోరింగ్ మరియు ఆనందకరమైన క్షణాలు ఉంటాయి. వేరే వాళ్ల జీవితం చూసి నిరుత్సాహ పడకండి. మీకు ఉన్నదానితో సంతృప్తి గా ఉండండి. సోషల్మీడియాలో చూసిన వాటి వల్ల నిర్ణయాలు తీసుకోకండి.
4. మీ వ్యక్తిగత జీవితం జాగ్రత్త: మీ check in సమాచారం , ఫోన్ నంబర్స్ , అడ్రస్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని share చెయ్యకండి. Privacy settings గురించి పూర్తిగా అవగాహన పెంచుకోండి. మీ వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ share చెయ్యకండి అది చాలా ప్రమాదం.
5. మంచి వ్యక్తిగా ఉండండి: ఎదుటివారిని బాధపెట్టే post లు పెట్టకండి share చెయ్యకండి. తిడుతూ పెట్టే comments లో , trollings లో ఇన్వాల్వ్ అవ్వకండి. ప్రతీ మనిషికి మీలాగే ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళని గౌరవించండి.
6. సోషల్ మీడియా ఫాలోయింగ్ కి బానిస కాకండి: మీకు ఎక్కువ likes రాకపోయినా పర్లేదు. మీరు పెట్టిన status ను ఎవరు పొగడకపోయినా పర్లేదు. సోషల్ మీడియాలో likes కోసం కడుపు మాడ్చుకుని హానికరమైన Cosmotics వాడుతూ మీకు సహజంగా ఉన్న అందాన్ని నాశనం చేసుకోకండి. సోషల్ మీడియా ఫాలోయింగ్ కన్నా మీ ఆరోగ్యం, ఆనందం ముఖ్యం. మీ కన్నా మీ ఫ్రెండ్స్కి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా ఏం పర్లేదు. సోషల్ మీడియా కన్నా ముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయి. సోషల్ మీడియా likes ఎందుకూ పనికి రావు. సోషల్ మీడియాలో వచ్చే likes, ఫాలోయింగ్ ద్వారా మీ జీవితాన్ని నిర్ణయించకండి. మీ జీవితం సోషల్ మీడియా కన్నా గొప్పది.
7. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కన్నా మీకు బయట ఉన్న స్నేహితులతో మాట్లాడండి: మీరు ఏదైనా brand లేదా product ను ప్రచారం చేస్తుంటే పర్లేదు గానీ అలా ఏమీ లేకపోతే మీ ఫాలోయింగ్ అంతా కేవలం నంబర్స్ మాత్రమే. మీకు సోషల్ మీడియాలో 500 ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. మీరు ప్రతిరోజూ వాళ్ళని ఫాలో అవ్వడానికి మీ సమయాన్ని, శక్తిని వృదా చేస్తారు. కానీ మీకు అవసరమైనపుడు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే మీ కోసం నిలబడతారు. ఈ మాయలో పడి నిజమైన బంధాలను నిర్లక్ష్యం చెయ్యకండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. కుదిరినప్పుడు కలుస్తూ ఉండండి. వాళ్ళతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండండి. మీకు ఇష్టమైన వాళ్ళతో గడిపిన క్షణాలను ఏ సోషల్ మీడియా ఇవ్వలేదు. మీరు low గా ఉన్నప్పుడు మీకు కావాల్సినవి నిజమైన బంధాలు.
8. నేర్చుకోవడానికి సోషల్ మీడియాను వాడండి: సోషల్ మీడియాను స్పూర్తి పొందడానికి అవ్వడానికి ఒక సాధనంలా వాడండి. ఏదైనా కొత్తవి నేర్చుకోవడానికి వాడండి. గొప్పవి సాధించిన వారు వాళ్ళ సమయాన్ని నేర్చుకోవడానికి ఎదగడానికి వెచ్చిస్తారు. కాబట్టి సోషల్ మీడియా ను మీరు ఎదగడానికి వాడండి.
9. అలర్ట్ గా ఉండండి: కొన్నిసార్లు మనం ఏదైనా నేర్చుకుందాం అనే చూస్తాం . కానీ మనకి తెలియకుండానే గంటలు గంటలు ఉపయోగం లేని వాటిని చూస్తూ గడిపేస్తాం. మీరు పోగొట్టుకున్న డబ్బుని సంపాదించు కోవచ్చు కానీ మీరు కోల్పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. సోషల్ మీడియా లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మన body కి Mind కి హానికరమైన కంటెంట్ చాలా ఉంది. మీరు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో జాగ్రత్తగా గమనించండి.
సోషల్ మీడియా ను ఎలా వాడాలో చెప్పే కొన్ని సూచనలు ఇవి. వీటిని పాటించి మీకు ఉపయోగ పడే విధంగా వాడండి. Like రాలేదని following లేదని బాధపడే కంటే ఏదైనా కొత్త విషయాలని నేర్చుకోవడానికి వాడండి. సోషల్ మీడియా ఉన్నది మన జీవితాన్ని కాస్త తేలిక చెయ్యడానికి మాత్రమే.
So take it easy. మీ నిజమైన రిలేషన్ షిప్స్ తో ఆనందం గా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించండి.