ఆహారం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. ఆహారం అవసరం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం కూడా. మనం ఆరోగ్యకరమైన ఆహారం తినేటప్పుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాం. అనారోగ్య కరమైన ఆహారం తినడం అనేది మన జీవితంలోకి వ్యాధులను ఆహ్వానించడం లాంటిది. కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలని ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం.
ఆరోగ్యకరమైన ఆహారం సంక్లిష్టంగా, కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన జీవన శైలిలో భాగంగా మార్చడానికి మన ప్రస్తుత అలవాట్లలో కొన్ని మార్పులు అవసరం. సరైన ప్రణాళిక మరియు సహనం ముఖ్యం.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి తొమ్మిది సాధారణ సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. మీ రోజువారీ ఆహారంలో పచ్చి కూరగాయలు ఉండేలా చూసుకోండి: పచ్చి కూరగాయాలలో fiber (పీచు పదార్థం) మరియు పోషకాలు ఎక్కువగా ఉండి మనం బరువు పెరగకుండా చూస్తాయి. ఎప్పుడూ యౌవ్వనంగా అందంగా ఉంటారు. జీర్ణ శక్తి పెరుగుతుంది. పచ్చి కూరగాయాలలో జీవం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి అది చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారంలో కనీసం 20% పచ్చి కూరగాయలు ఉండేలా అలవాటు చేసుకోండి. Cucumber, క్యారెట్, టమోటో, బీట్ రూట్ తో చాలా సలాడ్స్ తయారు చేసుకోవచ్చు. పచ్చి కూరగాయాలతో smoothies చేసుకుని తాగడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.
2. నెయ్యి వాడండి: నెయ్యి వల్ల బరువు పెరుగుతారు అనే ఒక భ్రమ. ఆధునిక కాలంలో సైన్స్ చేసిన పరిశోధనల వల్ల ఆ భ్రమ తొలగిపోతుంది. ఇప్పుడు నెయ్యి అద్భుతమైన ఆహారం. నెయ్యి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఎన్నో వేల సంవత్సరాల నుండి నెయ్యి మనం జీవితంలో ఒక భాగం చేశారు మన పూర్వీకులు. నెయ్యిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పోషకాలు మన శరీరంలోకి చాలా తేలికగా శోషణ (absorb) చేసుకోబడతాయి. దానివల్ల మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతే కాకుండా నెయ్యి మన ఆహారానికి అదనపు రుచిని తీసుకువస్తుంది. కాబట్టి నెయ్యిని వాడడం అలవాటు చేసుకోండి. మంచి ఆవు నెయ్యి మీరు ఇక్కడ కొనొచ్చు.
3. Dry fruits తినండి: రోజూ ఒక గుప్పెడు dry nuts తీసుకోండి. వీటివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. యవ్వనంగా ఉంటారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఎములకి బలాన్ని ఇస్తాయి. ఇవి రుచిగా ఉండడమే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, రైసిన్స్ మొదలైనవి తీసుకోండి. Nuts తో చేసిన ఆరోగ్య కరమైన స్నాక్స్ మీరు ఇక్కడ పొందవచ్చు. ఉప్పు కలిపిన nuts లో ఎక్కువగా సోడియం ఉండడం వల్ల అవి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.
4. మైదా బదులు గోధుమ పిండి వాడండి : మనం విరివిగా వాడే మైదాలో కెలరీలు తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఎక్కువగా మైదా తినడం వల్ల diabetes, బరువు పెరగడం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పదే పదే తినాలనిపించే గుణం ఉండడం వల్ల మీరు addict అవుతారు. బేకరీ పదార్థాలలో చాలా ఎక్కువగా వాడతారు. పిజ్జాలు, నూడిల్స్, స్వీట్స్, మొదలైన బేకరీలో దొరికే వాటిలో చాలా ఎక్కువగా మైదా ఉంటుంది. కాబట్టి మీరే వీటిని గోధుమ పిండితో మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది మరియు ఎన్నో పోషకాలు ఉంటాయి. మైదాతో తయారు చేసే ప్రతీదీ గోధుమ పిండితో చేసుకోవచ్చు. అలాంటి వంటలు మీరు ఇక్కడ చూడవచ్చు.
5. పంచదార వాడకం తగ్గించాలి: పంచదార ఆరోగ్యానికి చాలా హానికరం. బరువు పెరగడం, diabetes, పళ్ల సమస్యలు, గుండె జబ్బులు పంచదార వల్లే వస్తాయి. ఇది ఎక్కువ తినాలి అనిపించే విధంగా ఉంటుంది. ఇది ఎక్కువగా స్వీట్స్ లోనూ, బేకరీ పదార్థాలలోనూ వాడతారు. వీలైతే పంచదార ని పూర్తిగా వాడడం మానేయాలి లేదా తగ్గించాలి. పంచదార బదులు ఇవి వాడవచ్చు.
1. తేనె
2. కొబ్బరి పంచదార (coconut sugar )
3. ఖర్జూరపు paste
మీరు diabetic అయితే వీటిని వాడే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి.
6. కూల్ డ్రింక్స్ ప్రత్యామ్నాయంగా ఆరోగ్య కరమైన డ్రింక్స్ తీసుకోండి : మార్కెట్ లో దొరికే అన్ని రకాల కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా పంచదార మరియు హానికర రసాయనాలు ఉంటాయి. వాటిలో కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. వీటివల్ల అధిక బరువు, జీర్ణ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతినడం, dehydration, గుండె సమస్యలు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీటికి బదులు ఆరోగ్య కరమైన డ్రింక్స్ తీసుకోవచ్చు.
1. కొబ్బరి నీళ్ళు
2. నిమ్మకాయ నీళ్ళు
3. చెరుకు రసం
7. చాకొలెట్స్ మరియు స్వీట్స్ కి దూరంగా ఉండండి : చాలామందికి చాకొలెట్స్ మరియు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కానీ వాటిలో ఎక్కువగా పంచదార ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం. బరువు పెరగడంతో పాటూ ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలకి కారణం అవుతాయి. హానికర రసాయనాల వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. వీటికి బదులు పళ్ళు, తేనెతో లేదా ఖర్జూరాల పేస్ట్ తో తయారు చేసిన స్వీట్స్ తీసుకోవచ్చు. ఆ వంటలు మీరు ఇక్కడ చూడవచ్చు. పంచదార లేకుండా తయారు చేసిన స్వీట్స్ మీరు ఇక్కడ కొనవచ్చు.
8. ఆరోగ్య కరమైన స్నాక్స్ తినండి : సమోసా, చిప్స్, burgers, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి స్నాక్స్ ఆరోగ్యానికి చాలా హానికరం. రుచిగా ఉండాలంటే అనారోగ్య కరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరంగా రుచిగా ఉండే ఎన్నో రకాల స్నాక్స్ ఉన్నాయి. అలాంటి స్నాక్స్ కోసం మీరు ఇక్కడ చూడవచ్చు. ఎలాంటి హానికర రసాయనాలు లేని స్నాక్స్ మీరు ఇక్కడ కొనవచ్చు.
9. ఇంటి వంటకే ప్రాముఖ్యత ఇవ్వండి: ఇంటిదగ్గర వండిన వంటకి, బయటనుండి కొనుక్కుని వచ్చిన దానికి పోషకాల విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎన్నో తేడాలు ఉంటాయి. మనకి బయట దొరికే అన్ని పదార్థాలలో హానికర నిల్వ ఉంచే రసాయనాలు, ఎక్కువగా వేడిచేసిన నూనెలు ఉంటాయి. ఎక్కువగా పంచదార, సోడియం ఉండి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఇంటిదగ్గర వండుకోవడమే ఉత్తమం. ఇంటిదగ్గర వండుకుంటే అందులో ఏ ఏ పదార్థాలు వాడాలో మీఆధీనంలో ఉంటుంది.జాగ్రత్తగా వండవచ్చు. ఒక వంటలో పోషక విలువలు పెంచడానికి ఇంటిదగ్గర వండడమే సరైన పద్దతి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఇవి కొన్ని సూచనలు. ఆహారం తయారు చెయ్యడానికి మీరు పడిన శ్రమ వృధాగా పోదు. మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మన తినే ఆహారమే మనం. మనం శ్రద్ద లేకుండా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే తర్వాత నష్టపోయేది మనమే. ఎన్నో రకాల రోగాల భారిన పడి బాధపడతాం.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.