ఆనందకరమైన జీవితం కోసం సులువైన Feng Shui సూచనలు

ఆనందకరమైన జీవితం కోసం
Share

జంతువుల కైనా, పక్షులకైనా లేదా మనుషులకైనా ఈ భూమి అత్యంత సౌకర్యమైన ప్రదేశం ఇల్లు. తమ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీ తో నింపాలని మనుషులు పురాతన కాలం నుండి  ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు.  కొన్నిటిని కనుగొన్నారు.  అవి కాలంతో పాటు మారుతూ వచ్చాయి. అలాంటి  ఒక సాంకేతిక విజ్ఞానమే Feng Shui.

Feng shui చైనా యొక్క పురాతన సాంకేతిక విజ్ఞానం. ఏదైనా ప్రదేశాన్ని,  ఇంటిని లేదా ఆఫీస్ ని మన శ్రేయస్సుకు  తగిన విధంగా తయారు చేసే పద్ధతుల గురించి ఇది తెలుపుతుంది. ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, రిలేషన్ షిప్ మరియు ప్రశాంతత ఇవన్నీ కలిపితే న ఒక వ్యక్తి యొక్క సమృద్ధికరమైన  జీవితం అవుతుంది. మన లక్ష్యాలను సాధించడానికి మన ఇల్లు, మన ఆఫీస్, మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉండాలో దానికి తగిన సాధనాలు ఏంటో feng shui తెలుపుతుంది. కొన్ని వందల సంవత్సరాలు అభివృద్ధి చెందిన విధానం ఇది.

ప్రతిరోజు ఆనందకరమైన మరియు సమతుల్యమైన జీవితం గడపడానికి అవసరమైన సులువైన feng shui సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మీ వాలెట్ కి మరియు మీ డబ్బుకి విలువ ఇవ్వండి : సమృద్ధికరంగా ఉన్న జీవితం ప్రతి మనిషికి అవసరం. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని, సమృద్ధిని అద్భుతంగా ఉంచడంలో మరియు ఆ వ్యక్తి జీవితం లోకి మరింత సంక్షేమాన్ని ఆకర్షించడంలో వాలెట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాలెట్ ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక వ్యక్తి యొక్క జీవితంలో సమృద్ధిని తీసుకు వస్తుంది. వాలెట్ ని మరియు డబ్బుని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మీ వాలెట్ ని శుభ్రం చేసుకోండి. అవసరం లేని విస్టింగ్ కార్డ్స్, పాత బిల్లులు, పనికిరాని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు తీసేయండి.

2. మీ వాలెట్ లో అన్ని అందంగా, పద్ధతిగా సర్దుకోండి.

3. డబ్బులు ఒక క్రమపద్ధతిలో పెట్టుకోండి. నలిగిపోయిన మరియు చిరిగిపోయిన నోట్లు మాత్రం పెట్టకండి.

4. మీ వాలెట్ ని అజాగ్రత్తగా ఒక పక్కన విసిరేయకండి. జాగ్రత్తగా ఒక గౌరవప్రదమైన ప్రదేశంలో ఉంచండి.

5. భయపెట్టే బొమ్మలు ఉన్న వాలెట్ వాడకండి.

2. మీ చుట్టూ ఉన్న వస్తువుల పట్ల శ్రద్ద వహించండి: మీరు చూసే వస్తువులు మీ subconscious mind మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మీరు ప్రతిరోజు ఏం చూస్తారో మీరు అలా మారతారు.  కాబట్టి మీరు రోజు చూస్తున్న వస్తువుల పట్ల మనస్ఫూర్తిగా శ్రద్ద  పెట్టండి.  వాటిని మనస్ఫూర్తిగా ఒక పద్ధతి ప్రకారం సర్దుకోండి. ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.

1. మీకు ఆనందాన్ని ఇచ్చే వస్తువులు పెట్టుకోండి. ఇంటి నిండా మీకు ఆనందం ఇచ్చే వస్తువులు ఉన్నప్పుడు మీరు ఉదయం లేచినప్పటి నుంచి మీ జీవితం చాలా గొప్పగా మారుతుంది. మీ ఇల్లు ఆనందాన్ని విడుదల చేసే ఒక గుడిలా మారుతుంది.  కాబట్టి మీ చుట్టూ ఉన్న వస్తువుల మీద శ్రద్ధ పెట్టి మీకు ఆనందాన్ని ఇచ్చే వాటిపైన సమయం గడపండి.  ఫ్యాషన్ మరియు ట్రెండ్ కన్నా ఏదైనా వస్తువు కొనేముందు ‘ఇది నాకు ఆనందాన్ని ఇస్తుందా’ అని ఆలోచించండి.

2. నెగిటివ్ ఎనర్జీ ని మరియు ఆలోచనల్ని ఇచ్చే వస్తువులని తీసేయండి. ఉదాహరణకి భయపెట్టే బొమ్మలు, యుద్ధాలు, విచారంగా ఉన్న పెయింటింగ్స్ ఇలాంటివి తీసేయండి.

3. మీ జీవితంలో జరిగిన విచారానికి సంబంధించిన వస్తువులు తీసేయండి. ఉదాహరణకి మీకు కోపం తెప్పించే మీ పాత ప్రియురాలు ఇచ్చిన వస్తువులు ఇలాంటివి.

4. పగిలిపోయిన అద్దాలు లేదా పనిచేయని గడియారం ఇలాంటివి రిపేర్ చేయండి. లేదా బయటపడేయండి.

5. మీ చుట్టూ ఉన్న వస్తువులని ఒక పద్ధతి ప్రకారం సర్దుకోండి.

6. ఆరోగ్యాన్ని, ప్రేమని,  ప్రశాంతతని,  సమృద్ధిని ప్రతిబింబించే పెయింటింగ్స్ ఉంచండి. లాఫింగ్ బుద్ధ,  మంచి నేచర్ పెయింటింగ్స్,  బాతులు బొమ్మలు,  ఆనందంగా ఆడుకుంటున్న పిల్లల బొమ్మలు ఇలాంటివి ఉంచండి.

7. మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకోండి. మొత్తం ఇంటిలో గాలి ప్రసరించే విధంగా చూసుకోండి.  మీకు అవసరం లేని,  పనిచేయని వాటిని పడేయండి.

8. Feng Shui సమృద్ధి రంగులు అయిన గోల్డ్ మరియు పర్పుల్ నీకు నచ్చినట్టు అలంకరించుకోండి.

9. మీరు గతంలో సాధించిన విజయాల తాలూకు జ్ఞాపకాలను, అవార్డులు, మెడల్స్ వీటిని మీరు రోజు చూసే విధంగా పెట్టుకోండి. దీనివలన మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇది మీరు విజయం సాధించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

10. ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువు కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇంతకు ముందు వాడిన వారి ఎనర్జీ లను అవి తీసుకొస్తాయి.  మంచైనా, చెడైనా అది ఇంతకు ముందు వాడిన వారిని బట్టి ఉంటుంది.

3. మీ వంటగది విషయంలో జాగ్రత్తగా ఉండండి : feng shui లో వంటగది ఆరోగ్యానికి, సమృద్ధికి ప్రతిబింబం. సరిగా పట్టించుకోని వంటగది అనారోగ్యకరం మాత్రమే కాకుండా కుటుంబం యొక్క ఆరోగ్యం మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ వంటగదిని జాగ్రత్తగా చూసుకోవడం వలన మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఉండి మీ జీవితంలో సమృద్ధి, సంక్షేమం ఉంటాయి. కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మీ వంట గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. కీటకాలు, బొద్దింకలు లేకుండా చూసుకోండి.

2. స్టౌ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఒలికిన మరకలు, కాలిన వస్తువులు లేకుండా చూసుకోండి.

3. మీ సరుకులు పెట్టుకునే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.

4. మీ వంటగదిలో గాలి చక్కగా ఉండేలా చూసుకోండి.

5. మీ సింక్ ను శుభ్రంగా ఉంచుకోండి.

6. సంక్షేమానికి ప్రతిబింబాలుగా ఉన్న పెయింటింగ్స్ మరియు మంచి ఆహార పదార్థాలకు సంబంధించిన పెయింటింగ్ పెట్టుకోండి.

7. మీ వంటగదిలోకి సహజంగా వచ్చే సన్ లైట్ ఉండేలా చూసుకోండి.

8. వాడేసిన గిన్నెలు, పనికిరాని డబ్బాలు బయట ఉండేలా జాగ్రత్త వహించండి.

9. పదునుగా ఉండే చాకులు, ఫోర్క్ లు  దూరంగా ఉండేలా చూసుకోండి.

10. మీ వంటగదిలో ఒక గిన్నెలో తాజా పండ్లు ఉండేలా చూసుకోండి. ఇది సంక్షేమానికి సమృద్ధికి ప్రతిబింబం.

4. మరి కొన్ని feng shui సూచనలు

1. మీ కంటి చూపు మేరలో ఎలాంటి పదునైన వస్తువులు లేకుండా చూసుకోండి . ఇవి మీ ఎనర్జీలను నాశనం చేస్తాయి.

2. ఇండోర్ ప్లాంట్స్ ఉండేలా చూసుకోండి. ఇవి ఆరోగ్యాన్ని, నూతన ఉత్సాహాన్ని ఆకర్షిస్తాయి.

3. మీ టాయిలెట్ శుభ్రంగా, మూసి ఉండేలా చూసుకోండి.

4. ఏదైనా పైపు లీక్ అవుతుంటే రిపేర్ చేయించండి.

5. భీమ్ కింద కూర్చోవడం లేదా పడుకోవడం ఇలాంటివి చేయకండి.

మన రోజువారీ జీవితంలో పాటించదగ్గ feng shui సూచనలు ఇవి మీ చుట్టూ ఉన్న ప్రదేశం మీరు తీసుకునే నిర్ణయాలను, మీ ఆలోచనలని, మీ ఎమోషన్స్ ని ప్రభావితం చేస్తుంది.  కాబట్టి మీ చుట్టూ ఉన్న ఈ ప్రదేశానికి గౌరవం ఇచ్చి దానిని జాగ్రత్తగా చూసుకోండి.  మీ ఇంటిని అద్భుతంగా చూసుకుంటే అది మిమ్మల్ని అద్భుతంగా చూసుకుంటుంది.  ఇదే feng shui యొక్క మూల సిద్ధాంతం.  మీ జీవితంలో సమృద్ధి ప్రేమ ప్రశాంతత లభించును.

Registration

Forgotten Password?

Loading