” Follow Your Heart ” అంటే ఏంటి ??

ఫాలో యువర్ హార్ట్
Share

” Follow Your Heart ” అంటే  మనసుకు నచ్చింది చెయ్యడం. మనసుకు నచ్చింది చెయ్యడం అనగానే అన్ని వదిలేసి డబ్బు సంపాదించినా లేకపోయినా, మన కుటుంబం  బావున్నా లేకున్నా మన మనసుకు నచ్చింది చెయ్యడం అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి “మనసుకు నచ్చింది” అనే కాన్సెప్ట్ అర్థంకానట్టే. మనసుకు నచ్చింది చెయ్యడం అనేది చాలా లోతైన విషయం. కేవలం ఆలోచించి, కలలు కనడం వల్ల ఏమీ సాధించలేము. దృఢమైన సంకల్పం, సరైన ప్రణాళిక, కష్టపడి పనిచేయడం కావాలి.

అసలు ఎందుకు మనసుకు నచ్చింది చేయాలనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సులువుగా సమాధానం చెప్పాలంటే గ్రీకు ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఆనందం గురించి చెప్పింది గుర్తుచేసుకోవాలి. ఆయన ఏమన్నాడంటే “ ఆనందం అనేది మనిషి యొక్క జీవితానికి అర్థం, అదే అతని గమ్యం. ప్రతి ఒక్కరి లక్ష్యం, అసలు ఈ ఉనికే ఆనందం కోసం” అని అన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుండి మనందరం వెతుకుతున్నది అదే- ఆనందం. మనం ఎందుకు పెళ్లి చేసుకుంటాం? ఆనందం కోసం. ప్రమోషన్ కోసం ఎందుకు కష్టపడి పనిచేస్తాం? ప్రమోషన్ సాధిస్తే ఆనందంగా ఉంటాం అని భావించి. మన చుట్టూ ఎవరు ఏ పని చేసినా వారి అంతిమ లక్ష్యం మాత్రం ఆనందమే.

మనందరికీ ఆనందం కావాలి. కానీ నిజం ఏమిటంటే మనలో చాలామంది ఆనందంగా లేరు. మనం చేసే ప్రతిపని ఆనందం కోసమే అన్న విషయం మనం మర్చిపోయాం. రోజూవారీ పనుల్లో బిజీ  అయిపోయాం. ఒక రోజులో ఎన్నో పనులు చేస్తూ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ విసిగిపోయాం. కాసేపు ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకోండి “నా జీవితంలో నేను నిజంగా ఆనందంగా ఉన్నానా?”

మనలో చాలామందికి మన కలలు, లక్ష్యాలు గుర్తుండవు. ఒకవేళ గుర్తున్నా అవన్నీ నిజ జీవితంలో కావులే అనుకుంటాము. ఒకప్పుడు అవే కలలు మనని నడిపించాయి. ఇప్పుడు మన హృదయంలో ఎక్కడో సమాధి అయిపోయాయి. వాటి గురించి ఆలోచించడానికి మనకి సమయం లేదు. నిజం కాని మన కలల విషయంలో రాజీ పడిపోతాం. “జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నా వయసు పెరిగింది నేను ప్రాక్టికల్గా ఉండాలి” అని అనుకుంటూ మనల్ని మనం ఓదార్చుకుంటాం. ఇంకా ఎక్కువ బాధపడి మన లోపల ఏముందో చూడడానికి మనం ఇష్టపడం.

” Follow Your Heart ” మన కలలు , ఆనందం విషయంలో ఇలా ఎందుకు చేస్తాం ??

ఎందుకంటే “మనసుకు నచ్చింది” అనే కాన్సెప్ట్  పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల.  మనసుకు నచ్చింది అనే కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే ఏంటి ? మంచి ఆరోగ్యం, ఆనందకరమైన బంధాలు, ఆర్థికపరమైన సక్సెస్, ఆధ్యాత్మికత అనే పునాదుల పైన మన మనసుకు నచ్చింది సాధించడం. మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడే మనం సాధించాలి అనుకున్నది సాధించగలము. ఉదాహరణకి ఒక వ్యక్తి రచయిత కావాలి అనుకుంటున్నాడు అనుకుందాం. కానీ అతని దగ్గర తన రోజువారీ ఖర్చులు కూడా డబ్బులు లేవు. ఇప్పుడతను తను అనుకున్న దానికోసం ఆనందంగా పని చేయగలడా? చెయ్యలేడు. రచయిత కావాలన్న తన కోరికకి, రచయితగా తను సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే కెరీర్ కి మధ్య  నలిగి పోతాడు. ఆఖరుకి అతను ఆ కెరీర్ నే ఎంచుకుంటాడు ఎందుకంటే తన కుటుంబాన్ని  బాగా చూసుకోవాలన్నా, తన EMI లు కట్టాలన్నా డబ్బు చాలా ముఖ్యం కాబట్టి. ఒకవేళ అతను రచయితగా కొనసాగినా ఆర్థికంగా విజయం సాదించకపోతే అది ఇంకా ఘోరం. అప్పుడు తనకి ఇష్టమైన రచన ను కూడా అతను ఎంజాయ్ చెయ్యలేడు.

జీవితంలో అన్ని విభాగాలు బావున్నపుడు మనసుకు నచ్చింది చెయ్యడం చాలా అందంగా, అర్థవంతంగా ఉంటుంది. కొన్ని విభాగాలను పట్టించుకుని కొన్నిటిని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల నిజమైన ఆనందం దొరకదు. సరైన ఆరోగ్యం లేకుండా మంచి రిలేషన్ షిప్  ఉండడం, సరైన ఆరోగ్యం ఉన్నా మంచి ఆర్థిక స్థితి లేకపోవడం, ఆర్థిక స్థితి ఉన్నా ఆరోగ్యం లేకపోవడం, మంచి కెరీర్ ఉన్న ఆర్థికంగా వెనుక బడడం- ఇవి మనసుకు నచ్చింది చెయ్యడం కాదు.

శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్  గా, ఆధ్యాత్మికంగా , మంచి కుటుంబంతో, మంచి ఆర్థిక స్థితితో అన్ని విభాగాలలో ఉన్నతంగా ఉన్న వ్యక్తి మనసుకు నచ్చింది అనే కాన్సెప్ట్  ను ఫాలో  అయినట్టు. అలాంటి వ్యక్తి అన్నిటినీ సమానంగా చూసుకుంటూ ఆనందాన్ని విజయాన్ని పొందుతూ తన జీవితాన్ని మరింత మెరుగ్గా చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనిషి యొక్క సామర్ధ్యం అనంతమైనది.

కాబట్టి మనసుకు నచ్చింది చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. మీకు గిటార్ ప్లే చేయడం ఇష్టం కాబట్టి సాఫ్ట్ వేర్ కెరీర్ వదిలేయడం కాదు. అవును గిటార్ ప్లే చేయడమే కెరీర్ గా ఉండడం బావుంటుంది. కాకపోతే ఆర్థికపరమైన ఎదుగుదల, మంచి ఆరోగ్యం, అర్థం చేసుకునే రిలేషన్ షిప్స్  ఉండాలి. మీరు ఆ అడుగు వేసేముందు మీ జీవితంలో అన్ని విభాగాలు  బాగుండేలా చూసుకోవాలి.

మనసుకు నచ్చింది చేయడం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత తీసుకుని కష్టపడి పనిచేస్తే మన జీవితంలో మనకు కావలసిన అన్ని వస్తాయి. మన కోరికలను నెరవేర్చుకోగలం.  ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వస్తే గొప్ప జీవితం మీ సొంతం అవుతుంది. మంచి ఆరోగ్యం, గొప్ప ఫ్యామిలీ లైఫ్ పొందుతారు.

ఆ బాధ్యత ఒక పుస్తకం చదవడం ద్వారా, ఏదైనా వినడం ద్వారా, ఒక సెమినార్ కి వెళ్లడం ద్వారా నో రాదు. ఇవన్నీ కొంత సహాయం చేస్తాయి కానీ దృఢంగా నిలబడవలసింది మీరే. మీ జీవితంలో ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత మీ బాస్ , తల్లిదండ్రులు, లేదా మీ భార్య ది కాదు. వాళ్లంతా మీ వెనక ఉండి సపోర్ట్  చెయ్యగలరు కానీ అడుగు ముందుకేసి సాధించాల్సింది మీరే.

ఒకే ఒక సరైన సమాధానం ఉండడం అనేది లేదు. అందరికీ ఒకే డైట్  ఉండదు. అందరికీ పనిచేసే ఒకే వ్యూహం ఉండదు. మనలో ఎవరికి వారు ప్రత్యేకం, జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎవరికి వారికి సొంత వ్యూహం ఉండాలి. మీ ఆనందమే ముఖ్యం, మీ ఆనందం కోసం కావాల్సిన ప్రతీది మీ దగ్గర ఉంది. మీ జీవితాన్ని మీరే అద్భుతంగా మార్చుకోవచ్చు.

మీ మనసుకు నచ్చింది చెయ్యడానికి సరైన టూల్స్ , వ్యూహాలు, వనరులు మరియు సాధనాలు, మీకు స్పూర్తిని ఇస్తూ సపోర్ట్ చెయ్యడానికి మన్ ఘాట్ మీ ముందుకి వచ్చింది. మీ మనసుకు నచ్చింది చేస్తూ మీ కలలను నిజం చేసుకోండి.

ఇప్పుడే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.

మనసుకు నచ్చింది చెయ్యడం గురించి మరింత తెలుసుకోవడానికి ఈ అద్భుతమైన పుస్తకం చదవండి

Registration

Forgotten Password?

Loading