మన జీవితంలో తల్లిదండ్రులు,భార్య లేదా భర్త, పిల్లలు, స్నేహితులు ఇలా ఎన్నో రకాల రిలేషన్ షిప్స్ ఉంటాయి. ఈ రిలేషన్ షిప్స్ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇవి మనకి ఆనందాన్ని, జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి. ప్రేమించడం, ప్రేమించబడడం అనేది ఒక గొప్ప అవకాశం. జీవితంలో ఎలాంటి రిలేషన్ షిప్స్ లేకుండా ఒంటరిగా ఉండాలని ఎవరూ కోరుకోరు.
రిలేషన్ షిప్స్ లో ఒడిదుడుకులు రావడం అనేది చాలా సాధారణ విషయం. కోపం, విసుగు, ప్రేమ, కృతజ్ఞత ఇలా ఎన్నో ఎమోషన్స్ ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉండే రిలేషన్ షిప్ ఈ భూమ్మీదే లేదు. రిలేషన్ షిప్స్ లో ఈ సంఘర్షణ మామూలు విషయం. కానీ కొన్నిసార్లు మనం విపరీతమైన సంఘర్షణ అనుభవిస్తాం. దానిని ఎదుర్కోవడం మనకి చాలా పెద్ద సవాలుగా ఉంటుంది.
చాలా వరకు రిలేషన్ షిప్స్ లో రెండు విషయాల వల్ల సమస్యలు వస్తాయి. ఒత్తిడి మరియు ఓపిక లేకపోవడం. మనం ఒత్తిడితో నిండిపోయి ఉన్నప్పుడు చిన్న తప్పులు కూడా మనకి చాలా కోపం వచ్చేలా చేస్తాయి. ఎదుటివారు చేసిన తప్పులని భూతద్దంలో చూసి మరింత కోపానికి గురవు తాము. మన ఒత్తిడిని ఎదుటివారి మీద చూపిస్తాం. ఉదాహరణకి ఆఫీస్ లో జరిగిన కొన్ని విషయాలు మన మీద ఒత్తిడిని పెంచితే ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మీద అరుస్తాము. ఒక ఇంట్లో భార్యకి మరియు భర్తకి ఇద్దరికీ ఆఫీసులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాళ్ల రిలేషన్ షిప్ చాలా ఇబ్బందుల్లో పడుతుంది.
కాబట్టి ఒత్తిడి వల్ల ఏర్పడే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి ? దీనికి సమాధానం మెడిటేషన్. మనం క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే మన ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మీద చూపించకుండా మన ఒత్తిడి క్రమబద్దీకరించడం అలవాటవుతుంది. మెడిటేషన్ చేయడం వలన ఓపిక పెరుగుతుంది. ఈ మార్పులు మన రిలేషన్ షిప్ మీద చాలా పాజిటివ్ గా ప్రభావం చూపుతాయి.
మెడిటేషన్ చేయడం వల్ల రిలేషన్ షిప్స్ లో కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
1. మనపై మనకు ప్రేమ : మనలో చాలా మంది ఇతరులను ప్రేమిస్తారు కానీ వారి విషయానికి వచ్చేసరికి చాలా కఠినంగా ఉంటారు. మన నుంచి మనం చాలా ఎక్కువ ఆశిస్తాం. అది జరగన పుడు చాలా నిరాశకు గురవుతారు. ఆ అపరాధ భావంతో మనల్ని మనమే బాధ పెట్టుకుంటాము. మన లుక్ విషయంలో ఇలానే ఉంటాం. కొంతమంది ఆడవాళ్లు చాలా అందంగా ఉన్నా, వాళ్ళు అందంగా లేరని అనుకుంటూ ఉండటం చాలా ఆశ్చర్యకరం. రోజు మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న దైవత్వం మనకు తెలుస్తుంది. మన శరీరంలో, మైండ్ లో, ఆత్మలో దైవత్వాన్ని చూడడం మొదలుపెడతాము. మన ఆత్మ సౌందర్యాన్ని చూడడం మొదలు పెడతాము. ఇది మనకు పాజిటివ్ ఎనర్జీను ఇచ్చి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాము. మనతో మనకున్న అనుబంధం మరింత బలపడుతుంది. అపరాధ భావం ఒక వ్యక్తి యొక్క ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మనం రోజూ మెడిటేషన్ చేయడం వలన అపరాధ భావాన్ని, మనల్ని మనం బాధ పెట్టుకునే వైఖరిని వదిలేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రపంచాన్ని ప్రేమించాలంటే ముందు మనల్ని మనం ప్రేమించడం ముఖ్యం. ఇది మెడిటేషన్ వల్ల సాధ్యమవుతుంది.
2. పెళ్లిని మరింత అందంగా మారుస్తుంది : ఇద్దరు వ్యక్తులు కలిసి అందమైన జీవితాన్ని ఏర్పరచుకోవడమే పెళ్లి. పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని పెళ్లిళ్లు ప్రేమతోను మరియు నిజాయితీ తోనే మొదలవుతాయి. కానీ కొంతకాలం గడిచేసరికి ఇవి కేవలం కొన్ని పెళ్లిళ్లలో మాత్రమే మిగులుతాయి. దీనికి ప్రధాన కారణం ప్రతి రోజూ ఉండే ఒత్తిడి ఇంటి పనులు ఆఫీస్, జీవితంలో రకరకాల బాధ్యతలు నిర్వర్తించడం మొదలైనవి. మనం రోజూ మెడిటేషన్ చేస్తూ ఈ ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉంటే మన వైవాహిక జీవితం చాలా మెరుగు పడుతుంది. మన భార్య లేదా భర్తలో దైవత్వం చూడడం మొదలు పెడతాం. ఇప్పుడు ప్రయాణం గొప్పగా మారుతుంది. ఒకరినొకరు క్షమించుకోవడం మొదలుపెడతాం. మన జీవితంలో ఈ మ్యాజిక్ ని మెడిటేషన్ ఇస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మెడిటేషన్ చేస్తే ప్రతిరోజు ప్రేమ యొక్క అనుభూతిని మరింత గొప్పగా ఆస్వాదిస్తారు.
3. పిల్లల్ని పెంచడం ఆనందకరంగా ఉంటుంది : తల్లిదండ్రులు అవడం అనేది జీవితంలో ఒక భాగం. మన జీవితాన్ని పిల్లలతో పంచుకుని వాళ్ళు ఎదుగుతుండగా చూడడం గొప్ప అనుభూతి. తల్లిదండ్రులుగా పిల్లలకి అన్నీ ఉత్తమమైనవి ఇవ్వాలనుకుంటాం. కానీ ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి వల్ల మన ఓపిక నశించి పిల్లల్ని పెంచడం కష్టమవుతుంది. దానివలన పిల్లల్ని పెంచడం లో ఉన్న ఆనందం కోల్పోతున్నాము. ఇది మనలో అపరాధభావం ని సృష్టిస్తుంది. మనం రోజు మెడిటేషన్ చేస్తే మన పిల్లల్లో దైవత్వాన్ని చూస్తాం. జీవితంలో ఒక కొత్త దృక్కోణం వచ్చి పిల్లల జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాం. జీవితంలో ఏది ముఖ్యమైనదో తెలుసుకోవడం మొదలుపెడతాం. పూర్తి స్పృహతో పిల్లల్ని పెంచుతూ దానిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తాం. మనం పిల్లల్ని పెంచే విధానం మార్చడానికి మెడిటేషన్ ఒక పునాది.
4. ఆనందకరమైన రిలేషన్ షిప్స్ : మన అత్తమామలతో, తల్లిదండ్రులతో, బాస్ తో, మనతో పనిచేసే వారితో, మనకి రిలేషన్ షిప్ ఉంటుంది. రోజు మెడిటేషన్ చేస్తే ఓపిక, అంగీకరించేతత్వం పెరగడం వల్ల వీళ్ళతో మన అనుబంధం మరింత దృఢం అవుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, ఆలోచనలు,, ఎమోషన్స్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాము. ఇది మనల్ని మరింత స్నేహపూర్వకంగా మారుస్తుంది దానివల్ల మన రిలేషన్ షిప్స్ ఆనందకరంగా ఉంటాయి.
5. క్షమించే గుణం పెరుగుతుంది : రిలేషన్ షిప్స్ లో మన వల్ల లేదా ఇతరుల వల్ల తప్పులు జరుగుతాయి. వీటిని క్షమించడం అంతా సులభం కాదు. కానీ ఈ తప్పుల యొక్క అపరాధ భావాన్ని మనం మోస్తూ ఉంటే జీవితంలో ప్రశాంతత దూరం అవుతుంది. మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ప్రస్తుత జీవితంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాము. కాబట్టి మనల్ని మరియు ఎదుటివాళ్ళని క్షమించడం చాలా ముఖ్యం. మెడిటేషన్ వల్ల క్షమించి ముందుకు సాగిపోయే లక్షణం పెరుగుతుంది. గతం తాలూకు గాయాల్ని వదిలేసి అందమైన భవిష్యత్తు వైపు మనల్ని నడిపించడం మెడిటేషన్ వల్ల అవుతుంది.
మెడిటేషన్ వల్ల రిలేషన్ షిప్స్ లో కలిగే లాభాలు ఇవి. మీ జీవితంలో ఉన్న రిలేషన్ షిప్స్ ని అందంగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. రోజూ మెడిటేషన్ చేస్తూ మీ రిలేషన్ షిప్స్ ని మెరుగు పరచుకోండి. జీవితం మీకు ఇచ్చిన అన్ని బంధాలను ఆస్వాదించండి. ఏ కారణం లేకుండా మీ జీవితంలోకి ఎవ్వరూ రారు. మీ జీవితంలో ఉన్న ప్రతీ రిలేషన్ షిప్ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుంది. మీ రిలేషన్ షిప్స్ ని మెరుగుపరచుకుని జీవితంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించండి.