టెక్నాలజీ యొక్క అత్యున్నత కాలంలో మనం ఉన్నాం. మన జీవితాన్ని మరింత మెరుగు పరచడానికి ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త ఆవిష్కరణ వస్తూనే ఉంది. ఈ టెక్నాలజీ వల్లే మనం సినిమా టికెట్ కోసం క్యూ లో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది, బ్యాంక్ కి వెళ్ళకుండానే డబ్బులు పంపగలుగుతున్నాం. కేవలం ఒక్క క్లిక్ తో భూమికి అటుపక్క ఉన్న వ్యక్తితో కూడా మనం మాట్లాడగలం. టెక్నాలజీ వల్ల ప్రపంచమే ఒక చిన్న గ్రామం అయిపోయింది. ఒక 20 ఏళ్ల క్రితం తో పోలిస్తే కొత్త విషయం నేర్చుకోవడం అనేది ఇప్పుడు చాలా సులభం. ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడూ లేనంత ఉన్నత స్థితిలో ఉంది. ఇలాంటి కాలంలో ఉన్నందుకు మనం నిజంగా అదృష్టవంతులం. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉంటే మనం ఎన్నో పనులు చేయగలం దానివల్ల మన జీవితంలో చాలా మార్పు వచ్చింది. టెక్నాలజీ మన జీవితాన్ని మార్చడమే కాదు మన రిలేషన్ షిప్స్ ను కూడా చాలా మార్చింది.
ఇప్పుడున్న టెక్నాలజీ లేని రోజుల్లో మన ప్రియమైన వారికి మనం లెటర్స్ రాసేవాళ్ళం. సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేవు కాబట్టి వాళ్ళతో కాబట్టి ఎక్కువ సమయం గడిపే వాళ్ళం. ఆ రోజుల్లో ఒకరి కళ్లలోకి ఒకరం చూస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుకునేవాళ్ళం. ఆరు బయట ఫ్రెండ్స్ తో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ పాతకాలపు విషయాల్లా అనిపిస్తాయి. మన జీవితంలో ప్రతీ మూలకి టెక్నాలజీ వచ్చేసి మన జీవితాన్ని సమూలంగా మార్చేసింది. టెక్నాలజీ చాలా శక్తివంతమైనది. టెక్నాలజీ మంచివైనా చెడ్డవైనా దాన్ని మనం ఎలా వాడతారు అనే దాని మీద దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది.
టెక్నాలజీ ని మన Quality of life ను ఎలా బ్యాలెన్స్ చేయాలో ఈరోజు చూద్దాం.
1. మీ శరీరానికి పని చెప్పండి : టెక్నాలజీ వల్ల శరీరానికి శ్రమ లేకుండా బతకడానికి మనం అలవాటు పడిపోయాం. మన రోజువారీ పనులు చేయడానికి కూడా మెషీన్స్ ఉన్నాయి. మన పూర్వీకులు రోజంతా కేవలం ఆహారం సంపాదించడం కోసమే పని చేసేవారు. ఇప్పుడు మన మొబైల్ నుండి ఆర్డర్ ఇవ్వడం ద్వారా వండిన ఆహారం పొందుతున్నాము. కానీ మన శరీరం ఫిజికల్ యాక్టివిటీ కోసం డిజైన్ చెయ్యబడింది అని మనం మరచిపోకూడదు. ఉపయోగించాలి లేదా పాడయిపోతుంది. ఇదే మన శరీరం లక్షణం. ఏదోక పనితో మన శరీరాన్ని వాడకపోతే రోగాలతో పాడైపోతుంది. కాబట్టి ప్రతీరోజూ ఏదోక ఫిజికల్ యాక్టివిటీ చెయ్యండి. నడవడం లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా పని చెయ్యడం, యోగా లేక మరేదైనా. శారీరక శ్రమ ముఖ్యమని గుర్తుంచుకోండి ఎందుకంటే అదే మన శరీరతత్వం.
2. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులని కలవడానికి ప్రాధాన్యత ఇవ్వండి: ఈరోజుల్లో మనం చాలా పనులతో బిజీగా బతుకుతున్నాం. ఎవరినైనా వెళ్లి కలవడం కన్నా ఫోన్ చెయ్యడం తేలిక. ఫోన్ చెయ్యడం కన్నా Whatsapp చెయ్యడం తేలిక. కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల విషయానికి వస్తే వెళ్లి కలవడంలో ఉన్న ఆనందాన్ని ఇంకేదీ ఇవ్వలేదు. మీరు చూసే విధానం, నవ్వు, మీ స్పర్శ , మీ మాట – మీ బంధం గొప్పగా ఉండడానికి ఇవన్నీ చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కలవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
3. పూర్తిగా శ్రద్ద పెట్టండి: మనలో చాలా మంది ఎదురుగా ఉన్న వారు చెబుతున్న దాని మీద శ్రద్ధ పెట్టరు. వాళ్లతో మాట్లాడుతూనే facebook చూసుకోవడం, Messages పంపడం, whatsapp చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. Facebook, Whatsapp లు ఎక్కడికి వెళ్ళిపోవు. కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి మీ ఏకాగ్రతను కోరుకుంటున్నారు. అది కేవలం మీ సమయాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీను పక్కన పెట్టి మాట్లాడుతున్న వారిపైన శ్రద్ద పెట్టండి. ఈ ఒక్క పనితో మీరు గొప్ప భాగస్వామిగా, గొప్ప పేరెంట్ గా , ఎంప్లాయిగా, మంచి వ్యక్తిగా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారు.
4. గేమ్స్ కి బానిసగా మారకండి: మన మొబైల్స్ కి, laptop కి చాలా గేమ్స్ ఉన్నాయి. అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి త్వరగా మనం బానిస అయిపోయేలా ఉంటాయి. ఎందుకంటే మనం బానిస అయ్యేలా అవి డిజైన్ చేస్తారు. గేమ్స్ కి బానిస అవ్వడం వల్ల ఒత్తిడి, insomnia, డిప్రెషన్కు దారతీస్తుంది అని WHO డిక్లేర్ చేసింది. గేమ్స్ కి బానిస అవడం మన వ్యక్తిగత బంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. పనిలో నాణ్యత తగ్గి, జీవితంలో ఒక లక్ష్యం లేకుండా పోతుంది. అనారోగ్యం పాలవుతారు. ఎంతసేపు గేమ్స్ మీద సమయం గడుపుతున్నాం. మనం బానిస అయిపోతున్నమా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
5. ఆరుబయట physical Games ఆడండి: football, క్రికెట్, badminton లాంటి ఆటలు ఆడే విధంగా పిల్లల్ని ప్రోత్సహించండి. ఈ ఆటలు ఒత్తిడి ను దూరం చేసి ఫిట్ గా , ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా చేస్తాయి. టీం వర్క్ నేర్చుకుంటారు. గెలవడంలో ఉన్న ఆనందం , ఓటమిని ఒప్పుకోవడం తెలుస్తుంది. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం అని నేర్పే చోటు ఆటస్థలం.
6. సోషల్ మీడియా మరియు Internet సమయాన్ని తగ్గించుకోండి : సోషల్ మీడియా వల్ల family and friends తో తేలికగా టచ్ లో ఉండవచ్చు. కానీ మనం ముందు చెప్పుకున్నట్టు సోషల్ మీడియా మనం బానిస అయ్యే విధంగా డిజైన్ చెయ్యబడింది. కాబట్టి సోషల్ మీడియా మీద ఎంత సమయం గడుపుతున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. లేదంటే మీ విలువైన సమయం వృధాగా పోయి ముఖ్యమైన పనులు చెయ్యలేరు. అందరి పోస్ట్ లు ఫాలో అవ్వడం, ఫొటోస్ చూడడం బావుంటుంది. దానికన్నా మన లక్ష్యాలను సాధించడం ఇంకా బావుంటుంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మనం ఎంత సేపు internet వాడుతున్నామో జాగ్రత్తగా ఉండకపోతే బానిస అవుతాము.
7. మీ ఖాళీ సమయాన్ని సక్రమంగా వాడుకోండి: టెక్నాలజీ వల్ల మన రోజువారీ పనులు చాలా తేలికగా అయ్యి మనకి చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. మనం తరచూ “నాకు సమయం లేదు “ అంటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే మన ఖాళీ సమయాన్ని ఎంతసేపు వాడుతున్నమో తెలియకుండా internet పై గడపడమే. ఆ సమయాన్ని మన స్కిల్స్ పెంచుకోవడానికి, ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ మీద, మన రిలేషన్ షిప్స్ మీద పెడితే మనకి ఉపయోగం. మీ సమయాన్ని నేర్చుకోవడం మీద పెట్టండి. టెక్నాలజీ వల్ల మనకి చాలా destractions ఉన్నాయి. ఎక్కడితో ఆగిపోయి మన సమయాన్ని కాపాడుకోవాలో ఒక గీత గీసుకోoడి. ఎందుకంటే వృధా గా పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు.
8. నేచర్ లో గడపండి: నేచర్ మీద తీసిన డాక్యుమెంటరీ చూడడం, నేచర్ ఫొటోస్ మొబైల్ లో చూడడం ఇవేవీ నేచర్ లో గడపడం వల్ల వచ్చే ఆనందానికి దగ్గరకి కూడా రావు. నేచర్ లో గడపండి. దూరంగా ఉండి ఎక్కువ ఖర్చు అయ్యే ప్రదేశాలు అవసరం లేదు. మీకు దగ్గర్లో ఉన్న పార్క్ అయినా కావొచ్చు. పక్షులను చూడండి, జంతువులు , చెట్లు,సీతాకోక చిలుకలు, పువ్వులు చూడండి. చెట్ల నీడలో కూర్చోవడం, కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డపై నడవడాన్ని ఆస్వాదించండి. ఇలా నేచర్ లొ గడపడం వల్ల మీ ఒత్తిడి దూరం చేసి శరీరం మరియు మైండ్ ను ప్రశాంతంగా ఉంచుతుంది.
మన Quality Of Life ను పాడు చేసుకోకుండా టెక్నాలజీను వాడుకోవడానికి ఇవి కొన్ని సూచనలు. మన చేతిలో ఉన్న గొప్ప శక్తి టెక్నాలజీ . కానీ అంతకన్నా అద్భుతమైన జీవితం ఉంది.