ఆర్థిక నష్టాలను డీల్ చెయ్యటం ఎలా ?

Share

నష్టపోవటం అనేది జీవితంలో సహజం. ఒక మనిషిగా ప్రతి లాభంతో కొంత నష్టం ఉంటుందని మనం అంగీకరించాలి. నష్టం  అనేది ఆర్థిక మైనదైనా, భావోద్వేగాలికి సంబంధిచినదైనా లేదా మరేదైనా  కావచ్చు. దాన్ని అంగీకరించి జీవించడం నేర్చుకోవాలి. నష్టం గురించి ఆలోచించడం లేదా వినడం ఎవరూ ఇష్టపడరు, ప్రతి ఒక్కరూ లాభాన్ని మరియు అంతకంటే  ఎక్కువ మాత్రమే కోరుకుంటారు. అతను/ఆమె 1000 సార్లు ఆలోచించే విషయాన్ని వదులుకోమని ఒక వ్యక్తిని అడగండి. ఖచ్చితంగా కాదంటారు. అందుకుగాను వారికి ఏదైనా ఉచితంగా ఇవ్వండి, అతను/ఆమె దానిని వెంటనే అంగీకరిస్తారు. చాలా మంది విషయంలో ఇది నిజం. ఇది మన గురించి ఏమి చెబుతుంది? ఇది మనలో ఉన్న దురాశను మాత్రమే చూపిస్తుంది. ఆ దురాశే మనకి కలిగిన నష్టాన్ని మరింత బాధాకరంగా చేస్తుంది.

మనుషులుగా, మనం  ఇక్కడ సన్యాసులు కావడానికి రాలేదు , అందుకే మనకి  కోరికలు లేకుండా బ్రతకాలని  చెప్పడం సరి కాదు . కానీ మనమందరం ఖచ్చితంగా మన దురాశను విడిచిపెట్టగలము. దురాశ అనేది అవాస్తవిక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, దురాశ ఒక వ్యక్తిని తాము చేస్తున్నది సరైనది అదే ఫైనల్ అని  భావించేలా చేస్తుంది మరియు కొంత నష్టాన్ని కలిగించే బాధను కూడా పెంచుతుంది 

ఆర్ధిక నష్టం :

ఎన్నో కుటుంబాలు , స్నేహితులు, ఎందరో  సన్నిహితులు , అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్ళు ఇలా ఎన్నో బంధాలు ఆర్ధిక నష్టం కలగటం వలన కూలిపోయాయి. ఆర్ధికంగా నష్టపోయిన వారికి అందరు వీలైనంత దూరంగా ఉంటారు . ఒకసారి నష్టం కలిగితే వారిని ఆటోమేటిక్ గా వాళ్ళని దూరంగా ఉంచేస్తారు .  మీరు దీన్ని నమ్మకపోతే, ఒకసారి ఈ ప్రయోగాన్ని ప్రయత్నించండి: కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా, మీరు నష్టపోయారని  , అందువలన అందరు మనిషికొక  25000 రూపాయలు ఇచ్చినట్లయితే మీరు మీ సమస్య నుంచి బయట పడతారని రాయండి . అలాగే, మీకు మీ డబ్బులు వెనక్కి రాగానే ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగి  ఇస్తారని వారికి భరోసా ఇవ్వండి. 

ఆర్ధిక నష్టం ఒక మనిషి జీవితాన్ని కష్టతరం చేస్తుంది. ఆర్ధిక నష్టం నుండి బయట పడాలంటే ఒకటి మీరు ఆర్ధిక సహాయం చేసేవాళ్ళని వెతకాలి లేదంటే మీకు ఉన్న ఆస్తులని అమ్మి కొంతలో కొంత ఆర్ధిక నష్టాన్ని భర్తీ చెయ్యాలి. 

ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే, మీ నిర్ణయాలు అత్యాశ మరియు నిరాధారమైన సిద్ధాంతాలపై కాకుండా మంచి పరిశోధన మరియు ఆర్థిక సలహాల ఆధారంగా తీసుకోవాలి. మనం హైపర్-స్మార్ట్ ప్రపంచంలో జీవిస్తున్నాము, ఒక్క క్షణం మనం తల తిప్పి చూసిన మనం అప్పటివరకు కట్టుకున్న ఆశల భవనం కూలిపోతుంది. దీని అర్థం మీరు రిస్క్ తీసుకోలేరని కాదు, ఆలోచించి  రిస్క్‌లు తీసుకోవడం మంచిది . సరైన గైడెన్స్ తీసుకోని , భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మానసికంగా అప్రమత్తంగా ఉండటం, సాధన చేస్తే ఆర్థిక నష్టం కలుగకుండా జాగ్రత్త పడొచ్చు. 

సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి చిట్కాలు :

1.మీ ఆర్థిక లావాదేవీల కోసం ఎల్లప్పుడూ లాగ్‌ను మైంటైన్ చెయ్యండి .

2.సరైన వ్యక్తులను నమ్మండి,  ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.

3.ఫైనాన్స్ పట్ల మీ విధానం తెలివైనది మరియు భవిష్యత్తుకు అనుగుణంగా ఉండాలి. 

4.డబ్బు పెరుగుతోందని నిర్ధారించుకోవడానికి మీరు ఆర్థిక సలహాదారులతో సన్నిహితంగా ఉండాలి.

5.డబ్బు నిర్ణయాల విషయంలో అత్యాశతో వ్యవహరించటం తప్పు .

6.ప్రణాళిక అనేది దీర్ఘకాలిక విజయానికి కీలకం, మీ ప్రతి కదలికను ప్లాన్ చేయండి మరియు ఇది ఆర్ధిక ప్రమాదాలను  తగ్గిస్తుంది.

7.మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలను వేరుగా ఉంచండి. వ్యక్తిగత సంబంధాలలో డబ్బు చేరడం ఊహించని  పరిస్థితులకు దారి తీస్తుంది

8.బ్యాకప్ ప్లాన్‌లు ఎల్లప్పుడూ తప్పనిసరి, ఎల్లప్పుడూ మీ హే డే కోసం ప్లాన్ చేసుకోండి. ప్రతి పైసా ముఖ్యం.

9.మీకు వీలైనంత స్థాయిలోనే  ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నించండి, మీరు ఊహించని విధంగా అది మీకు తిరిగి వస్తుంది.

ముగింపు

డబ్బు చాలా గమ్మత్తైనది , డబ్బు వీలైనంత ఆదా చెయ్యటం వలన మీకు భవిష్యత్తులో సహాయపడుతుంది. డబ్బు ఎప్పటికి మీది కాదు దాని వెనుక పరిగెత్తడం అంత మంచిది కాదు. అందుకే మీకు ఉన్నదానితో సంతృప్తి చెందడం నేర్చుకోండి, మీకు రాసిపెట్టుంటే అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. కష్టపడి పని చేస్తూ సమయాన్ని తెలివిగా ఖర్చుపెడుతూ , ఎల్లపుడు ఉత్సాహంతో జీవించండి మరియు భవిష్యత్తు కోసం పశ్చాత్తాప పడకండి. మనం ఏమీ లేకుండా వచ్చాము మరియు ఏమీ లేకుండా వెళ్లిపోతాము, మనం మనతో తీసుకెళ్లేది మనం చేసిన మంచి మరియు చెడులు మాత్రమే మనం సంపాదించిన డబ్బు కాదు.

Registration

Forgotten Password?

Loading