ఆరోగ్య కరమైన కిచెన్ కోసం తొమ్మిది సూచనలు

ఆరోగ్య కరమైన కిచెన్
Share

ఒక వ్యక్తికి విశ్రాంతిని ఇచ్చి ఉత్సాహంగా మార్చేది చేసే ప్రదేశం ఇల్లు. బయటి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉన్నా, ఇల్లు అనే భావన ముందు ఏదీ నిలబడదు. సురక్షితమైన, అందమైన ఇల్లు ఉండటం జీవితంలో గొప్ప ఆనందాలలో ఒకటి. మనం మన  జీవితంలో ఎక్కువ భాగం మన ఇంటిలోనే గడుపుతాము. మన ఆరోగ్యం మనం ఇంట్లో వాడుతున్న ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది – టూత్‌పేస్టుల నుండి వంటసామానుల నుండి శుభ్రపరిచే ప్రొడక్ట్స్  వరకు. ఈ ప్రొడక్ట్స్  మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మన ఆరోగ్యాన్ని  ప్రభావితం చేసే ప్రొడక్ట్స్ లో వంటసామాను మరియు మన వంటగది చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి.

వంటగది అనేది పవిత్రమైన చోటు , ఎందుకంటే మొత్తం కుటుంబానికి ఆహారం అక్కడినుండే వస్తుంది. మరియు కుటుంబ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. Feng Shui లో ఆరోగ్యకరమైన వంటగది , సమృద్ధి మరియు సంపదను సూచిస్తుంది. వంటగది ఇంటికి గుండె లాంటిది. మన కుటుంబానికి సరైన పోషణ, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి కిచెన్ ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం.

మనం రోజూ వంటగదిని ఎంతోకొంత శుభ్రం చేస్తూనే ఉంటాము. కానీ ఇప్పుడు రసాయనాల రోజుల్లో బతకుతున్నాం కాబట్టి ఈ మాత్రం శుభ్రత సరిపోదు. మన చుట్టూ ఎన్నో రసాయనాలు ఉంటున్నాయి అందులో చాలా వరకూ ప్రమాదకరమైనవి. మనం వాడుతున్న ప్రోడక్ట్స్ ద్వారా ఈ రసాయనాలని మనకి తెలియకుండానే రోజూ తీసుకుంటున్నాము.

మన వంటగదిలో కుక్కర్ లు, vessels, storage containers, pans, cups, glasses, టిఫిన్ బాక్స్ లు మొదలైనవి వాడుతూ ఉంటాం. మన ఆరోగ్యం కోసం మంచి పదార్థాలనే వాడుతూ ఉండవచ్చు. ఎక్కువ ఫ్రై చెయ్యకుండా, పంచదార వినియోగం తగ్గించడం, మైదాని పూర్తిగా మానేయడం ఇలాంటివి. కానీ మనం వంటగదిలో వాడే సామానుల మీద శ్రద్ద పెట్టకపోతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృదా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్న చాలా వంట సామాగ్రి హానికరమైన రసాయనాలతో ఉన్నాయి.

వాటిలో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి వాటికి ప్రత్యామ్నాయంగా ఏవి వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం.

1. ప్లాస్టిక్ వంటసామాగ్రి – పప్పుధాన్యాలు, నూనెలు మరియు ఇతర వస్తువులను ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేస్తూ ఉంటాం. ఈ డబ్బాలు వివిధ ఆకర్షణీయమైన ఆకారాలు మరియు రంగులలో వస్తాయి మరియు అవి పెట్టిన ప్రదేశం యొక్క అందాన్ని పెంచుతాయి. అవి కూడా తక్కువ ధరకు వస్తాయి. కానీ ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో బిపిఎ వంటి అనేక విష రసాయనాలు ఉన్నాయి, ఇవి ఆహారంలోకి ప్రవేశిస్తాయి మరియు హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. మన వాడడం మానేయాల్సినవి ఇప్పుడు చూద్దాం.

1. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ : వీటికి బదులు స్టీలు, రాగి, లేదా గ్లాస్ బాటిల్స్ వాడండి.

2. ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ : వీటికి బదులు స్టీల్ బాక్స్ లు వాడండి. స్టీల్ బాక్స్ తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉన్నా పర్లేదు. ఆరోగ్యం అసలైన సంపద అని గుర్తుంచుకోండి.

3. ప్లాస్టిక్ బ్యాగ్స్: వీటికి బదులు క్లాత్ బ్యాగ్స్ వాడండి.

4. ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ – దీనికి బదులు చెక్కది వాడండి.

5. ప్లాస్టిక్ కప్స్  –వీటికి బదులు సిరామిక్ కప్స్ లేదా స్టీలు కప్స్

మనం వంటగదిలో వాడుతున్న ప్రతీ ప్లాస్టిక్ వస్తువుకి సిరామిక్, మట్టి, స్టీల్, ఇనుము, లేదా గ్లాస్ తో ప్రత్యామ్నాయం ఉంది. Online లో వెతకండి ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి.

2. అల్యూమినియం కుక్కర్లు: ఇవి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అందువల్ల అల్యూమినియం మన శరీరంలోకి వెళ్ళి dementia, Alzheimer వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

3. Non-stick pans- non sticks pan మీద దోశలు వేసుకోవడం మనందరికీ ఇష్టం. కానీ వాటిల్లో Teflon అనే రసాయనం ఉంటుంది. అది వేడిచేసినప్పుడు విషపూరిత రసాయనాలను విడుదల చేస్తుంది.వీటివల్ల చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి బదులు iron pan లేదా సిరామిక్, లేదా మట్టివి  వాడండి.  మొదట్లో iron pan మీద దోశలు సరిగా రాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే వస్తాయి పైగా ఆరోగ్యం కూడా.

4. ప్లాస్టిక్ వాటర్ క్యాన్ లు : పట్టణాలలో ప్లాస్టిక్ వాటర్ క్యాన్ లు లో నీళ్ళు త్రాగడం చాలా మామూలు విషయం అయిపోయింది. వాటిలోనుండి నీళ్ళు stainless steel పాత్రల్లోకి మార్చుకున్నాక వాడుకోండి. లేదంటే మట్టి కుండలు కూడా చాలా మంచి ప్రత్యామ్నాయం. నీటిని గంటల తరబడి plastics cans లో ఉండనివ్వకండి.

5. Aluminium foils– వీటితో ఆహార పదార్థాలని చుట్టి ఉంచుతారు. అది చాలా ప్రమాదకరం. వీటిబదులు stainless steel boxes వాడండి.

6. వంట సామాను కడిగే సబ్బు లేదా లిక్విడ్: బయట దొరికే చాలా సబ్బులలో triclosan, phosphates లాంటి హానికర రసాయనాలు ఉంటాయి. వీటిబదులు మీరే తయారు చేసుకోవచ్చు.

7. బొద్దింకల స్ప్రేలు: వీటిల్లో Permethrin, cypermethrin లాంటి చాలా ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అందువల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు, దగ్గు వస్తాయి. వీటి Eco friendly spray లు వాడండి.

8. Air fresheners: వీటిల్లో toluene, xylene లాంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటిబదులు మీరే ఇంట్లో తయారు చేసుకున్నవి వాడుకోవచ్చు, లేదా మార్కెట్ లో దొరుకుతాయి.

9. కిచెన్ క్లీనర్స్ : చాలా కిచెన్ క్లీనర్స్ రసాయనాలతో నిండి ఉంటాయి. వీటికి బదులు మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

మీ వంటగదిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇవి కొన్ని మార్గాలు. మీ వంటగదిని ఇలా మార్చుకోవడానికి కొంత సమయం, కృషి, డబ్బు అవసరం కానీ మీరు మరియు మీ కుటుంబం మొత్తం పొందే ప్రయోజనాల ముందు ఆ డబ్బు తక్కువే .ఒక ఆరోగ్యకరమైన వంటగది మన జీవితాలకు గొప్ప మార్పుని ఇస్తుంది . మీ వంటగదిని దశల వారీగా మార్చుకోవడం  ప్రారంభించండి మరియు అతి త్వరలో, మీ వంటగది ఆరోగ్యకర ప్రదేశంగా మారుతుంది.

Registration

Forgotten Password?

Loading