ఆత్మహత్య అనేది ఒక నిషేధించిన పదంలా చూస్తారు. దానిగురించి ఎవరూ మాట్లాడరు. అదేదో చాలా కొత్త విషయంలా చూస్తారు. కానీ ప్రతీ సంవత్సరం చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కప్రకారం ప్రతీ సంవత్సరం దాదాపు పది లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో ప్రతీ 40 సెకన్లకి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.15-29 మధ్య వయసు ఉన్న వాళ్ళు చనిపోవడానికి కారణాలు చూస్తే ఆత్మహత్య రెండవ స్థానంలో ఉంది. భారత దేశంలో 15-29 వయసులో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య అధిక స్తాయిలో ఉంది. ఈ గణాంకాలు మనకు ఏమి చెబుతున్నాయంటే ఈ ఆత్మహత్యల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఆత్మహత్య అనేది జీవితంలో ఒక తీవ్రమైన దశ. ఒక వ్యక్తి అలా ఆలోచించే లాగా చేసే కారణాలు ఏంటి ? రకరకాల పరిస్థితులు మరియు సమస్యలు ఒక వ్యక్తిని ఆత్మ్మహత్య గురించి ఆలోచించేలా చేస్తాయి. ఉద్యోగానికి సంబందించిన సమస్యలు, రిలేషన్ షిప్స్ కు సంబందించిన సమస్యలు,ఆరోగ్యం,ఆర్దిక స్తితి,చదువు ఇలా ఏదైనా కావొచ్చు.ప్రేమలో ఫెయిల్ అవడం లేదా చదువులో ఫెయిల్ అవడం లేదా వ్యాపారంలో నష్టపోవడం ఇలా ఏదైనా కావొచ్చు.
డబ్బున్న వాళ్ళు లేదా పేద వాళ్ళు,చదువుకున్న వాళ్ళు లేదా చదువుకోని వాళ్ళు,ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు,కుర్రాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఇలా ఎవరైనా కావొచ్చు.ప్రతీ మనిషికి సమస్యలు ఉన్నాయి.ఆ సమస్యల్ని సరైన విధంగా ఎదుర్కుంటే వాళ్ళకి కొత్త అవకాశాలు దొరుకుతాయి. కానీ అందరికీ ఆ సమస్యల్ని ఎదుర్కునే శక్తి ఉండదు. ఇదేమీ సిగ్గు పడాల్సిన విషయం కాదు. ఇది అందరికీ జరుగుతుంది.కాకపోతే మనలో కొంతమంది లైఫ్ లో ఎదురయ్యే సమస్యలని ఎదుర్కోవడానికి ఎమోషనల్ గా మరియు మానసికంగా సిద్దంగా ఉండరు.
ఒక వ్యక్తి ఎదుర్కునే సమస్యలకన్నా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలే ఆత్మహత్య చేసుకునేలా తనని ప్రేరేపిస్తాయి. ఒక సమస్య పెద్దదైనా, చిన్నదైనా ఆలోచనలే ఆత్మహత్యని ప్రేరేపిస్తాయి.చాలా మండి స్టూడెంట్స్ లేదా పెద్ద పేరు సంపాదించిన వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ఆలోచనలే కారణం. వాళ్ళు ఇంతకుముందు ఏం సాధించారు లేదా వాళ్ళకి జీవితంలో ఏం ఉంది లేదా వాళ్ళ సామార్ధ్యం ఏదైనా కానీ ఈ కింద తెలిపిన ఆలోచనలు పదే పదే ఆలోచించే వారు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1. నేను ఫెయిల్ అయ్యి బ్రతకలేను.
2. నా చుట్టూ అందరూ ఆనందంగా, విజయవంతంగా ఉన్నారు.నేను మాత్రమే ఫెయిల్ అయ్యి బాధ పడుతున్నాను.
3. నేను ఒక వ్యక్తిగా ఫెయిల్ అయ్యాను.నా వల్ల నా చుట్టూ ఉన్నా వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు.
4. ఇక జీవితంలో ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండలేను.
5. నేను ఎప్పటికీ విజయం సాధించలేను.
6. నా జీవితమే ఒక అపజయం.
7. నా కుటుంబం ముందు, నా స్నేహితుల ముందు తలెత్తుకోలేను.
8. నా మీద నాకే సిగ్గుగా ఉంది.
9. ఈ పరిస్థితులు నేను మార్చలేను.
10. నా సమస్యకి పరిష్కారమే లేదు .
11. నేను ఒంటరి వాడిని.
ఒక వ్యక్తి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తే కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. కొంతమంది డిప్రెషన్ అనే స్థాయి దాటిపోయి బతకడం కన్నా చావే నయం అనే ఆలోచనలోకి వెళ్లిపోతారు. చాలావరకూ ఆత్మహత్య చేసుకునే వారు తాము ఫెయిల్ అయ్యాం అనే భావన వల్లే చేసుకుంటారు.
అపజయం అనేది చాలా మామూలు విషయం. జీవితంలో అందరికీ ఎదురవుతుంది. రిలేషన్ షిప్స్ లో, ఆర్థిక విషయాల్లో, చదువులో, కెరీర్ లో ఫెయిల్ అవ్వడం జరగవచ్చు. అపజయం వస్తే ప్రపంచం అంతం అయిపోయినట్టా? కాదు. అది iమనకి విలువైన పాఠాలు నేర్పుతుంది. మనం ఇంకా ఎందులో మెరుగుపడాలో చెప్పే ఒక ఫీడ్ బ్యాక్ లాంటిది. అపజయం మనల్ని తెలివైన వారిగా మారుస్తుంది. చాలా బాధపెడుతుంది నిజమే. కానీ మనం అక్కడే ఆగిపోకూడదు. ఓటమి నుండి నేర్చుకుని ముందుకి వెళ్లిపోవాలి.
జీవితంలో గొప్పగొప్పవి సాధించిన వారు అందరూ ఓటమిని, వ్యతిరేకతని ఎదుర్కున్నవారే. నమ్మట్లేదు కదా.?
గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఎలా అపజయం పాలయ్యారో, అయినా ఆగిపోకుండా ముందుకి వెళ్ళి గొప్ప విజయాలను ఎలా అందుకున్నారో ఇప్పుడు చూద్దాం.
1. అబ్రహాం లింకన్ అమెరికాకి పదహారవ ప్రెసిడెంట్ అవ్వకముందు బిజినెస్ లో ఎన్నో అపజయాలు చూశాడు. రెండుసార్లు దివాళా తీశాడు. 26 సార్లు ఓడిపోయాడు.
2. వాల్ట్ డిస్నీ, డిస్నీ ప్రపంచాన్ని సృష్టించక ముందు ఊహాశక్తి, సృజనాత్మకత లేదనే కారణంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
3. బిల్ గేట్స్, Microsoft కి ముందు, traf-O- data అని ఒక కంపెనీ పెట్టాడు, కానీ అది విజయం సాధించలేదు.
4. అమితాబ్ బచ్చన్, ఇండియన్ సినిమా లెజెండ్ కాకమునుపు తన గొంతు బాలేదనీ, చూడ్డానికి బాలేడనీ రిజెక్ట్ చేయబడ్డాడు.
5. Oprah winfrey, tv superstar కాకముందు, ఆమె tv కి పనికిరాదు అనే కారణంతో రిపోర్టర్ ఉద్యోగాన్ని పోగొట్టుకుంది.
6. Thomos Edison, బల్బుతో పాటూ ఇంకా ఇన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తి టీచర్స్ చేత ‘స్టుపిడ్, అనీ ఏమీ నేర్చుకోలేడనీ’ అనిపించుకున్నారు.
7. అక్షయ్ కుమార్, బాలీవుడ్ సూపర్ స్టార్ స్కూల్లో ఫెయిల్ అయ్యాడు. కెరీర్ లో వరసగా 14 ఫ్లాప్ లు ఇచ్చాడు ఒకసారి.
వీళ్ళ ప్రయాణం అర్థం చేసుకుంటే అపజయం విజయానికి మెట్టు అని అర్థమవుతుంది. ఫెయిల్ అవ్వడం సహజమే, దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఓటమి ఎప్పుడు నిజంగా ఓటమి అవుతుందో తెలుసా మనం డానినుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోనపుడు. అలా నేర్చుకుని ముందుకి సాగిపోయినపుడు ఎన్నో అవకాశాలు మన ముందుకి వస్తాయి.
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బలహీనత కాదు. అలాంటి ఆలోచనలు ఆ వ్యక్తికి ఒక సహాయం, ఆదరణ కావాలి అని సంకేతం అంతే. ఇలాంటి ఆలోచనలని అధిగమించడం ఎలా?
ఇలాంటి ఆలోచనలు వచ్చినపుడు ఏం చెయ్యాలి?
1. ఇలాంటి ఆలోచనల నుండి బయటపడొచ్చు అని మనం నమ్మాలి. మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఎన్నో దారులు ఉన్నాయి. జీవితంలో వచ్చే సమస్యలకి ఆత్మహత్య పరిష్కారం కాదు. సమస్యలు అందరికీ వస్తాయి వాటిని అధిగమించడానికి ఎన్నో దారులు ఉన్నాయి.
2. Suicide prevention helplines సహాయం తీసుకోండి. వాళ్ళతో మాట్లాడితే మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని మాట్లాడతారు.
3. అప్పటి పరిస్థితులకన్నా అతని ఎమోషన్స్, ఆలోచనలు ఆత్మహత్య గురించి ఆలోచించేలా చేస్తాయి. ఇలాంటి వ్యక్తులకి వాటినుండి బయటపడడానికి యోగా, మెడిటేషన్ చాలా అద్భుతమైన సాధనాలు. కొన్ని నెలల సమయం తీసుకుని ఒక మంచి టీచర్ దగ్గర నేర్చుకుంటే ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలనుండి బయట పడవచ్చు. జీవితాన్ని ఒక్క కొత్త కోణంలో చూడగలం. మన ఎమోషనల్ మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుచేసుకోవడానికి యోగా మరియు మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు.
4. మీకు బాగా ఇష్టమైన హాబీలతో మిమ్మల్ని బిజీగా ఉంచుకోండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చెయ్యండి. మీకు నచ్చిన కామెడీ చూడడం లేదా నేచర్ లో సమయం గడపడం ఇలా ఏదైనా కావొచ్చు. మీకు ఆనందాన్ని ఇచ్చే ఏదోక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి.
5. అనాధ పిల్లలతో సమయం గడపడం, పేద పిల్లలకి చదువు చెప్పడం లేదా భోజనం పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉండండి. ఇలా ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మన అవసరం ఉంది. జీవితం చాలా విలువైనది. మీ వల్ల ఎదుటివాళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఆనందం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అది మీరు జీవించడానికి, ఈ ప్రపంచం మీద మీ ప్రభావం ఉండడానికి మీకు ప్రేరణ ఇస్తుంది.
6. ఆ దైవం యొక్క ప్రణాళికను నమ్మండి. కొన్నిసార్లు మనకి ఏం కావాలో దొరకకపోవచ్చు. బహుశా మనం కోరుకున్న దానికన్నా గొప్పది మనకోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. కాస్త సమయం, ఆ దైవం యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడం ముఖ్యం. దైవం యొక్క ప్రణాళికతో కనెక్ట్ అయ్యి ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క బలాన్ని పొందండి.
7. గౌతమ బుద్దుడు చెప్పినట్టు అపజయంతో సహా జీవితంలో అన్నీ తాత్కాలికమే. జీవితం జయాపజయయాలకు అతీతం. ఇది కేవలం గెలవడం ఓడిపోవడం గురించి కాదు. జీవితం యొక్క ఉద్దేశం ప్రతీరోజూ మనల్ని మనం మరింత ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకుంటూ మనకి ఎదురయ్యే ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడమే జీవితం. మీ మనసుకి నచ్చింది చేస్తూ మీ జీవితాన్ని ఒక లక్ష్యంతో జీవించండి. ఆరోగ్యం, ఫిట్ నెస్ , ఆర్థిక విషయాలు, రిలేషన్ షిప్స్ , కెరీర్ , పని ఇలా మీ జీవితంలో ప్రతీ విభాగం గురించి శ్రద్ద వహించండి.
ఆత్మహత్య ఆలోచనలనుండి బయట పడడానికి కొన్ని సూచనలు ఇవి. ఆత్మహత్య ఆలోచనలు ఉండడం తప్పుగానీ, సిగ్గుపడాల్సిన విషయం గానీ కాదు. మీకు కేవలం సహాయం అవసరం అంతే. మీ జీవితం చాలా విలువైనది. జీవితం నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలతో ఉన్నది. ఆత్మహత్య ఆలోచనలు మీ వెలుగుని అడ్డుకునే తాత్కాలికంగా వచ్చే మేఘాల వంటివి. ఆ మేఘాలని తొలగించి మరింత ప్రకాశించే శక్తి మీకు ఉంది.
Live life in full glory and joy! Keep shining!