భారతదేశంలో పాతరోజుల్లో అల్లరి చేసే పిల్లలకి, సరిగా చదవని పిల్లలని గుంజీలు తీయమని అనేవారు. వినాయకుని ముందు గుంజీలు తీయడం హిందూమత ఆచారం. గుంజీలు తీయడం మన సంస్కృతిలో ఒక భాగం. మన టీచర్స్ గుంజీలు ఎందుకు తీయిస్తారు? వినాయకుని ముందు గుంజీలు తీయడం వెనుక ఉద్దేశం ఏమిటి ? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? దీనికి సమాధానం బ్రెయిన్ యోగలో ఉంది. మాస్టర్ Choa Kok Sui అనే ఫిలిప్పీన్స్ వ్యక్తి ప్రపంచానికి సూపర్ బ్రెయిన్ యోగా టెక్నిక్ ఇచ్చాడు. ఇది చేయడానికి రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే అద్భుతమైన సులభమైన టెక్నిక్. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. Choa Kok Sui మోడ్రన్ ప్రాణిక్ హీలింగ్ యొక్క ఫౌండర్. స్కూల్ కి వెళ్లే పిల్లల మీద ఈ టెక్నిక్ తో ఎన్నో పరిశోధనలు చేసే చాలా ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల యొక్క మెరుగైన విధానం.
ఈయన చేసిన పరిశోధనలో బ్రెయిన్ యోగ వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం.
1. ఇది ఒక మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి తన మైండ్ లో చాలా చిన్న బాగాన్ని మాత్రమే జ్ఞానానికి వాడుతారు అని తెలుసు. ఈ సూపర్ బ్రెయిన్ యోగ వల్ల మనం వాడకుండా ఉన్నా మిగతా మెయిన్ బ్రెయిన్ కూడా ఆక్టివేట్ అవుతుంది. ప్రతిరోజు మన జీవితంలో ఉపయోగపడుతుంది.
2. ఇది జ్ఞాపకశక్తిని ఏకాగ్రతని పెంచుతుంది. ఎక్కువ ఏకాగ్రత ఉన్న వ్యక్తి చదవడం, ప్రోగ్రామింగ్, ప్లానింగ్ ఇలాంటి పనులు చాలా సులువుగా చేయగలరు. చదువులో రాణించాలంటే జ్ఞాపక శక్తి చాలా అవసరం.
3. మన మానసిక శక్తికి పదును పెడుతుంది మరియు మన ఆలోచనల్లో స్పష్టత తీసుకొస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అవసరం.
4. ADD/ADHD., autism తో బాధపడే పిల్లల పెరుగుదలలో చాలా సహాయపడుతుంది.
5. ఏదైనా నేర్చుకోవడానికి కష్టపడే వారికి, అల్జీమర్స్ ఉన్నవారికి, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది.
6. పిల్లలు బాగా చదవడాకి ఉపయోగ పడుతుంది. బ్రెయిన్ యోగా చేసే పిల్లలు ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటూ చదువులో అందరి కంటే ముందుంటారని రీసెర్చిలో తేలింది. చదువులోనే కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో చాలా ఏకాగ్రతతో ఉంటారు.
7. మెదడు యొక్క కుడి మరియు ఎడమ hemispheres అనుసంధానం చేయబడతాయి. అది మనిషి యొక్క పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది.
8. ఒక వ్యక్తి యొక్క సృజనాత్మకతను పెంచుతుంది. సృజనాత్మకత మన జీవితంలో ఆనందాన్ని, సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
9. మానసిక ప్రశాంతతని ఇస్తుంది.
10. మానసిక సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం ఇస్తుంది.
11. బ్రెయిన్ యోగా చేసే వ్యక్తి మానసికంగా సమతుల్యత కలిగి ఉంటాడు.
బ్రెయిన్ యోగ ప్రతి రోజూ చేయడం వల్ల కలిగే లాభాలు ఇవి. ఇది చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా చేయగలరు. ఇది చేయడానికి రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుంది. కానీ సరిగ్గా చేస్తే ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి.
కాబట్టి సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ఎలా ఇప్పుడు చూద్దాం.
1. నిటారుగా నిలబడండి.
2. మీ ఎడమ చేతిని పైకెత్తి బొటనవేలు మరియు చూపుడు వేలుతో మీ కుడి చెవిని పట్టుకోండి. మీ బొటన వేలు బయటకి ఉండాలి.
3. నీ కుడిచేతిని పైకెత్తి చూపుడు వేలు మరియు బొటన వేలితో మీ మీ ఎడమ చెవిని పట్టుకోండి. మీ బొటన వేలు బయటకి ఉండాలి.
4. మీ నాలుకని పైకెత్తి మీ నోటి లోని మెత్తని పైభాగాన్ని టచ్ చేయండి.
5. మీ రెండు కాళ్ళని మీ భుజాల వెడల్పు ఎంత దూరంగా పెట్టి నిలబడండి.
6. చేతులు అలాగే ఉంచి శ్వాసను తీసుకుని కిందకి కూర్చోవాలి.
7. ఒక్క సెకండ్ ఆగండి
8. శ్వాస ని వదిలి పైకి లేవాలి.
ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగాలో ఒక రౌండ్ అయినట్టు.
సూపర్ బ్రెయిన్ యోగా చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.
1. పైన తెలిపిన పద్ధతిని పాటించినప్పుడు మాత్రమే దీని నుంచి వచ్చే లాభాలు పొందగలరు. చేతుల అమరిక మరియు శ్వాస సరిగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సరైన పద్ధతిని కనుగొనడానికి మాస్టర్ Choa Kok Sui ఎన్నో సంవత్సరాల సమయం పట్టింది. చేతుల అమరిక సరిగా లేకపోయినా శ్వాస సరిగా తీసుకోకపోయినా దీని నుండి వచ్చే లాభాలు రావు.
2. సరైన లాభాలు పొందడానికి 40 సంవత్సరాలలోపు వ్యక్తులు తూర్పు వైపుకు తిరిగి చేయాలి. 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఉత్తరం వైపు తిరిగి చేయాలి.
3. గర్భవతులు, రుతుస్రావం లో ఉన్న స్త్రీలు దీనిని చేయకూడదు. ఇది శరీరం మీద ఎక్కువ శ్రమ పెట్టి మన చక్రాలని నెగిటివ్ గా ప్రభావం చేస్తుంది.
4. పరగడుపున చేయాలి
5. ఒక వ్యక్తి రోజుకి 7 నుంచి 14 రౌండ్స్ సూపర్ బ్రెయిన్ యోగా చేయవచ్చు. 14 కన్నా ఎక్కువ చేయడం మంచిది కాదు.
6. కీళ్ల నొప్పులు ఉన్నవారు పూర్తిగా కిందకి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఎక్కడ వరకు కిందకి వెళ్ళగలిగితే అంతవరకు వెళ్తే చాలు.
7. దీంతోపాటు వ్యాయామం మరియు 7 నుంచి 12 రౌండ్ల డీప్ బ్రీథింగ్ తీసుకుంటే మరిన్ని ఉపయోగాలు ఉంటాయి.
8. అన్ని వయస్సుల పిల్లలు, పెద్దలు దీని చేయవచ్చు.
సూపర్ బ్రెయిన్ యోగ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన సూచనలు ఇవి. సూపర్ బ్రెయిన్ యోగా ప్రతి రోజూ చేయడం వల్ల ఒక వ్యక్తి యొక్క జ్ఞానం మరింత మెరుగవుతుంది. అద్భుతమైన ఫలితాలు కేవలం కొన్ని నెలల్లోనే వస్తాయి. పాత రోజుల్లో టీచర్లు గుంజీలు తీయించడానికి కారణం ఇదే.
వినాయకుడిని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చే దేవుడిగా పరిగణిస్తారు. వినాయకుడి ముందు గుంజీలు తీస్తే మానసిక శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందువల్లనే భారతదేశంలో వినాయకుని ముందు గుంజీలు తీస్తారు. మనలో చాలామంది మన సంస్కృతి, సంప్రదాయాలని వ్యతిరేకిస్తారు. కానీ దాని గురించి మరింత తెలుసుకోండి. అందులో ఉన్న మన పెద్దవాళ్ళు జ్ఞానం మనకు బోధపడుతుంది. ఈ ఆర్టికల్ Choa Kok Sui చేసిన రీసెర్చ్ నుండి తీసుకోబడింది. యోగా గురించి మరింత తెలుసుకోవడానికి,ఆయన చేసిన చేసిన పరిశోధనలు తెలుసుకోవడానికి “Super Brain Yoga” by Master Choa Kok Sui చదవండి. ఈ పుస్తకంలో సూపర్ బ్రెయిన్ యోగా గురించి మరిన్ని విషయాలు ఉన్నాయి.