Circadian Rhythm యొక్క పది అద్భుతమైన ప్రయోజనాలు

Share

ఒక్కో రోజు ఒక్కో టైమ్  కి నిద్ర లేవడం. ఒకరోజు తొమ్మిది గంటలకి, మరోరోజు 8:50 కి అలా. మెలకువ వచ్చాక ఇంకాసేపు పడుకుని లేస్తూ మళ్ళీ పడుకుని అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ హడావిడిగా వెళ్ళడం. ఖచ్చితంగా complete చెయ్యాల్సిన పనులన్నీ ఖంగారుగా tension పడుతూ చెయ్యడం. Breakfast ని enjoy చేస్తూ తినేతంత time కూడా లేకుండా ఖంగారుగా తినేసి వెళ్లిపోవడం. ఇవన్నీ మీకు రోజూ జరిగేవిలానే ఉన్నాయా?? మనలో చాలామంది వాళ్ళ రోజుని ఇలాగే మొదలుపెడతారు. ఉదయం అంటే చాలా మందికి పెద్ద తలనొప్పి.

మా అమ్మమ్మ మాట వినకముందు వరకూ నా mornings కూడా ఇంచు మించు ఇలాగే ఉండేవి. మా అమ్మమ్మ మామూలు housewife కానీ ఆవిడ చేసే ప్రతి పని వెనక ఎంతో Science and Wisdom ఉంటాయి. ఆవిడ ఎప్పుడూ ఉందయం  5 గంటలకే నిద్ర లేచి నన్ను కూడా లేవమని విసిగించేది. అలా లేపడం చిన్నప్పుడు నాకు చాలా చిరాగ్గా ఉండేది. నేను అంత త్వరగా లేచి ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకునేదాన్ని. మా అమ్మమ్మ మాత్రమే కాదు మీ అమ్మమ్మ కూడా ఇదే చెప్పేది కదా.

ఎందుకు మన అమ్మమ్మలు ఉదయాన్నే లేస్తారు? మన సంస్కృతి, సాంప్రదాయాలు కూడా ఉదయాన్నే లేవమని ఎందుకు చెప్తాయి.? భూమి మీద జీవం సూర్యోదయంతో ప్రారంభం అవుతుందనా? లేదా వేదాలు చెప్పాయనా? మరి science ఏం చెప్తుంది. మన అమ్మమ్మల జ్ణానాన్ని science support చేస్తుందా? ఏమైనా ఆధారాలున్నాయా? అవును ఉన్నాయి. మన అమ్మమ్మల జ్ణానానికి science ఇచ్చిన ఆధారమే circadian rythm. 2017 లో circadian rythm మీద research చేసిన ముగ్గురు sceintists కి nobel prize కూడా ఇచ్చారు.

circadian rythm అంటే ఏంటి? మన body యొక్క biological and phisiological processes ని control చేసే ఒక 24 hours clock. మనం body ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలి ఇదే చెప్తుంది. ఎప్పుడు తినాలి ఇలా మన body కి ఎప్పుడు ఏది కావాలో చెప్తుంది. ఒక ఆఫీస్ కి timings ఉన్నట్టే ఎప్పుడు ఏం చెయ్యాలో మన body కి కొన్ని timings ఉంటాయి. ఆఫీస్ ఉదయం 9 కి మొదలయ్యి సాయంత్రం 5 కి అవుతుంది. కానీ ఎవరన్నా ఒకరు సాయంత్రం 4 కి వచ్చి రాత్రి 1 కి వెళ్తే. అలాగే మన body విషయంలో కూడా.

మన circadian rythm sunrise and sunsets తో connect అయ్యి ఉందని సైన్స్ చెప్తుంది. మన biological clock sunrise తో పాటు లేవమని sunset అవ్వగానే rest తీసుకోమని చెప్తుంది. మన పెద్దవాళ్ళు అలానే బ్రతికారు. మీరు గమనిస్తే వాళ్ళు నిద్ర లేవడం, నిద్ర పోవడం sunrise and sunset బట్టి ఉంటాయి.

మనం రోజూ చేసే పనులు మన biological clock సూచించిన విధంగా లేకపోతే అది రకరకాల రోగాలకి దారి తీస్తుంది. Circadian rythm ప్రకారం బ్రతకని వాళ్ళకి  insomnia, depression, anxiety,migrain, diabetes, obesity, dimentia, cardiovascular deseases వచ్చే అవకాశం ఎక్కువ ఉందని science చెప్తుంది. మనం పెద్దవాళ్ళు మానసికంగా, శారీరకంగా అంతా ధృఢంగా ఉండడానికి కారణం ఇదే.  Cricadian rythm అనే simple విషయాన్ని అర్థం చేసుకోవడం వల్లనే ఇది సాధ్యం.

Circadian rhythm disturb అయ్యే కొన్ని అలవాట్లు

 1. Sunrise అయ్యాక కొన్ని గంటల తర్వాత లేవడం.
 2. Night time ఎక్కువ మెలకువగా ఉండడం
 3. సరైన సమయంలో నిద్రపోకపోవడం, లేవకపోవడం
 4. రాత్రి ఎక్కువగా light ని చూడడం
 5. Frequent jetlags
 6. Night shifts
 7. సరైన సమయంలో తినకపోవడం

Circadian rythm ని improve చేసుకునే పది అలవాట్లు

 1. Sunrise తో పాటూ నిద్ర లేవడం
 2. sunset తో పాటు rest తీసుకోవడం
 3. ప్రతీరోజు ఒకే time కి పడుకోవడం, ఒకే time కి లేవడం. Weekends లో కూడా.
 4. లేచిన తర్వాత sunlight లో కనీసం 20-25 నిముషాలు exercise చెయ్యడం.
 5. Day ఎక్కువసేపు natural light లో ఉండడం.
 6. Electronic devices పగలు వాడినంత ఎక్కువ రాత్రి వాడకపోవడం
 7. Sunset అయిన తర్వాత electronic devices ని వాడాల్సివస్తే blue light filters ని వాడడం.
 8. పడుకునే చోట పూర్తిగా చీకటిగా ఉండేలా చూసూకోవడం.
 9. Day time లోనే తినడం. Sunset అయిన తర్వాత ఏమీ తినకపోవడం.
 10. Walking, jogging, ఏదైనా ఆడటం, gym, యోగా ఇలా ఏదైనా activity రోజూ చెయ్యడం

నేను circadian rythm connect అయ్యి ఉండేలా నా lifestyle చూసుకుంటాను. అలారం లేకుండానే sunrise తో పాటూ నిద్రలేస్తాను. Circadian rythm ని పాటించడం ద్వారా నాకు కలిగిన లాభాలు ఇవి.

 1. రోజంతా energy గా ఉండడం
 2. రోజూవారీ ఒత్తిడిని అధికమించడం
 3. ప్రతీరోజుని అద్భుతంగా start చెయ్యడం
 4. ప్రశాంతంగా నిద్ర పట్టడం
 5. రోజు హడావిడిగా ప్రారంభించకుండా రోజుని బాగా plan చేసుకోవడం.
 6. Body and brain ఎప్పుడూ Active గా ఉండడం.
 7. Physical గా, emotional గా, mental గా healthy గా ఉండడం.

మన పెద్దవాళ్ళు ఎప్పుడూ nature తో connect అయ్యి ఉండేవాళ్లు. వాళ్ళు sunlight తో పక్షులు చేసే శబ్దాలతో నిద్ర లేచే వారు.  అదే వాళ్ళకి సిగ్నల్. Nature మన కోసం అన్నీ healthy కి set చేసింది. కానీ మన ఈ మోడ్రన్ life style వల్ల circadian rythm ని disturb చేసుకుని ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాము. పగలు ఎక్కువ sunlight లో ఉండకుండా రాత్రి ఎక్కువ artificial light లో ఎక్కువగా ఉంటున్నాం.

Nature తో connect అయ్యి ఉండదాన్ని try చేద్దాం. ఉదయం sunlight లో చల్లని గాలిని, పక్షులు చేసే sounds ని enjoy చేద్దాం. సూర్య నమస్కారాలు చెయ్యడం body, mind,and soul ని సరైన విధంగా ఉంచి present moment లో ఉండేలా చేస్తుంది. మన రోజుని పవిత్రంగా మొదలుపెట్టే విధానం ఇది.

Registration

Forgotten Password?

Loading