ఎవరి జీవితంలోనైనా కష్టతరమైన విషయం బ్రేక్ అప్ . ఆ వ్యక్తి మన జీవితంలో ఇక ఉండరు అనే నిజం చాలా బాధ పెడుతుంది. తనతో మాట్లాడిన మాటలు, పంపుకున్న మెసేజ్ లు, ఆ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. ఎందుకు break up అయ్యింది అనే దానితో సంబంధం లేకుండా ఎవరినైనా దారుణంగా బాధపెడుతుంది. ఇది ఆ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం.
బ్రేక్ అప్ నుండి బయట పడడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. ఆ పరిస్థితిని అంగీకరించడం: break up అయిపోయింది అని అంగీకరించండి. ఇంకా ఆ రిలేషన్ షిప్ ని కొనసాగించడానికి ప్రయత్నించకండి. ఒంటరితనం వల్ల ఆ వ్యక్తి కాల్ లేదా మెసేజ్ చెయ్యకండి. ఇంకా స్నేహంగా ఉండాలని చూడకండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వకండి. ఆ వ్యక్తితో పూర్తిగా మీ రిలేషన్ షిప్ ని వదిలేసి ఆ వ్యక్తి ఇంక మీ జీవితంలో భాగం కాదని అర్థం చేసుకోండి. ఇది కష్టమైన పనే. కానీ ఇంకా దానికోసం బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తెలుసుకోండి.
2. బాధని విచారాన్ని అంగీకరించండి: ఆ బాధని, దుఖాన్ని అంగీకరించండి. విడిపోయినప్పుడు విచారంగా అనిపించడం సహజం. ఏడుపు మీకు ఉపశమనం ఇస్తే ఏడవండి. ఈ బాధపోవడానికి కాస్త సమయం పడుతుంది అని అర్థం చేసుకోండి. మీ భావోద్వేగాలను అణచివేయవద్దు.
3. బ్రేక్ అప్ ఎందుకు అయ్యిందో తెలుసుకోండి : రకరకాల కారణాల వల్ల బ్రేక్ అప్ అవుతుంది. ప్రతీ రిలేషన్ షిప్ ప్రత్యేకమైనది. మీకు సరిపడని వ్యక్తితో రిలేషన్ షిప్ వల్ల బ్రేక్ అప్ అయ్యింది. లేదా మీ మాటలతో మీ పనులతో ఎదుటి వారిని బాధపెట్టి ఉంటారు. నిజాయితీగా ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించుకోండి.
4. పాఠాలు నేర్చుకోండి: విడిపోవడం నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆలోచించండి. మీరు మీ సహనాన్ని మెరుగుపరచాలా? మీరు అవతలి వ్యక్తికి ఎక్కువ సమయం ఇవ్వాలా? మీ కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలా? రిలేషన్ షిప్ కి ముందు వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మీరు ఎక్కువ సమయం కేటాయించాలా? మీరు అవతలి వ్యక్తిని మార్చడానికి ప్రయత్నించడం మానేయాలా? బ్రేక్ అప్ నుండి నేర్చుకోవలసిన పాఠం ఉంటుంది. అవకాశాన్ని ఉపయోగించుకోండి మరియు పాఠం నేర్చుకోండి.
5. మీతో మీరు కనెక్ట్ అవ్వండి: ఈ సమయాన్ని మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించుకోండి. ఎలాంటి వ్యక్తి మీకు భాగస్వామిగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకు ? మీ రిలేషన్ షిప్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? మీ రిలేషన్ షిప్ కి మీరు ఏం ఇవ్వగలరు? ఎవరైనా వాళ్ళ జీవితాన్ని మీతో ఎందుకు పంచుకోవాలి ? మీ బలాలు, బలహీనతలు ఏంటి ? మీ గురించి మీకు బాగా తెలిసినపుడు మీకు ఎలాంటి వ్యక్తి కావాలో తెలుస్తుంది. ఒంటరితనం వల్ల ఏదో ఒక రిలేషన్ షిప్ లోకి వెళ్లిపోకండి. మళ్ళీ అవే తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రిలేషన్ షిప్ నుండి కాస్త విరామం తీసుకుని మీతో మీరు ఎక్కువ సమయం గడపండి.
6. మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి: కేవలం అందం మాత్రమే ఒక రిలేషన్ షిప్ ని success అయ్యేలా చెయ్యదు. మన వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక రిలేషన్ షిప్ కి కేవలం అందం మాత్రమే ముఖ్యం అనుకుంటే సినిమా హీరోలకి, మోడల్స్ కి అసలు breakups, మరియు విడాకులు ఉండవే ఉండవు. కాబట్టి సమయం తీసుకుని అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. అప్పుడు మీ జీవితంలోకి వచ్చే రిలేషన్ షిప్ కూడా గొప్పగా ఉంటాయి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం
1. జిమ్
2. బయట గేమ్స్ ఆడడం
3. యోగా
4. మెడిటేషన్
5. ప్రకృతిలో సమయం గడపడం
6. ప్రార్థన చేసుకోవడం
మీ break up మీరు ఇంకా ఉన్నతమైన వ్యక్తిగా మారడానికి వాడుకోండి
7. మీతో మీరు ప్రేమలో పడండి : ఒకరితో ప్రేమలో పడే ముందు, మీతో ప్రేమలో పడండి. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి. మీ అభిరుచులను కొనసాగించండి. మీకు వంట అంటే ఇష్టమా? అప్పుడు వివిధ వంటకాలతో ప్రయోగాలు చేసి, మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమా? అప్పుడు అందమైన పర్వతారోహణలకు వెళ్ళండి. మీరు ప్రకృతిని ప్రేమిస్తున్నారా? ప్రకృతిలో సమయం గడపండి. డాన్స్, పాడండి, పెయింట్ చేయండి, కవిత్వం రాయండి, గిటార్ వాయించండి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీరు మీ హాబీలు కొనసాగించినప్పుడు, మీరు ఆనందంగా ఉంటారు ముందుకు సాగడానికి తగినంత బలాన్ని పొందుతారు. మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రేమించండి. తనను తాను ప్రేమించగల వ్యక్తి వేరొకరిని కూడా ప్రేమించగలడు. ఆనందం మిమ్మల్ని ఆకర్షణీయమైన వ్యక్తిగా చేస్తుంది మరియు సరైన సమయంలో మీ జీవితంలోకి సరైన వ్యక్తి వస్తారు.
8. లక్ష్యాలు పెట్టుకుని వాటికోసం పనిచ్చెయ్యండి: మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు? మీ కెరీర్‌లో మీ లక్ష్యాలు ఏమిటి? మీ శరీరం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? సమయం తీసుకుని మీ జీవితంలో లక్ష్యాల గురించి ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించడానికి ఏం చేయాలో ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించండి.
9. అవతలి వ్యక్తిని క్షమించండి: క్షమించడం జీవితంలో చాలా ముఖ్యం. మీరు అవతలి వ్యక్తిని క్షమించనప్పుడు మీరు నెగెటివిటీ లో కూరుకుపోతారు. దానివల్ల మీ లక్ష్యాలను సాధించలేరు. ఆ మీకు ఒక పాఠం నేర్పారు అనుకుని వాళ్ళని క్షమించండి.
10. మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపండి: break up సమయంలో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ కూర్చోకండి. మీ best friend తో మాట్లాడండి, మీ కుటుంబ సభ్యులతో మీ బాధని పంచుకోండి. పంచుకుంటే బాధ తగ్గుతుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి.
Break up తర్వాత ముందుకు సాగడానికి మీకు సహాయపడే పది సూచనలు ఇవి. Break up అనేది అందరికీ జరుగుతుంది. అది జీవితంలో భాగం. కానీ అక్కడే ఆగిపోకండి. మీ జీవితం చాలా విలువైనది, break up వల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అవతలి వ్యక్తి నిర్ణయాన్ని గౌరవించండి. ఆనందానికి మీరు అర్హులు. పై సూచనల ద్వారా మీరు మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారవచ్చు.
Wishing you strength and love!