జీవితంలో చెయ్యకుండా ఉండాల్సిన పది సాధారణ తప్పులు

సాధారణ తప్పులు
Share

జీవితంలో తప్పులు జరగటం సహజం. జీవితంలో ఒక్క తప్పు కూడా చేయని వ్యక్తి ఈ భూమి మీదే లేడు. కాబట్టి తప్పులు సాధారణం. కొన్ని చిన్న చిన్న తప్పులు, మరికొన్ని చాలా పెద్ద తప్పులు. మనం చేసిన తప్పులు మనకి కొన్ని పాఠాలు నేర్పి మనం ఎదిగే విధంగా చేస్తాయి. అలా అని పాఠాలు నేర్చుకోవడానికి తప్పులు చేస్తూ ఉండనవసరం లేదు. ఇతరులు చేసిన తప్పుల నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు.

కాబట్టి ఆనందకరమైన జీవితం పొందాలంటే ఈ క్రింద తెలిపిన 10 తప్పులు చేయకుండా ఉండాలి.

1. సేవింగ్స్ చెయ్యకపోవడం : మనలో చాలా మంది చేసే తప్పు ఇది. డబ్బు సంపాదిస్తున్నప్పుడు చాలా మంది ఇక డబ్బు వస్తూనే ఉంటుంది అనుకుంటారు. దానివల్ల సేవింగ్స్ లేకుండా వాళ్ళ స్థాయికి, అవసరాలకి మించి ఖర్చు పెడుతూ ఉంటారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడైనా ఉద్యోగం పోయినప్పుడు లేదా అనుకోని కష్టాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సేవింగ్స్ లేకుండా ఎప్పుడూ ఉండకండి. మీ సంపాదనలో కనీసం 10 శాతం సేవింగ్స్ ఉంచండి. మీరు పొదుపు చేసిన డబ్బు మీకు ఆర్థిక భద్రత ఇస్తుంది. బ్యాంక్ అకౌంట్ లో కాస్త సేవింగ్స్ ఉండడం మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

2. వ్యాయామం లేని జీవితం గడపడం : ఈరోజుల్లో మనలో చాలామంది ఎలాంటి కదలిక లేని జీవనశైలికి అలవాటు పడిపోయారు. దీనివలన మనం అధిక బరువు మరియు ఇతర రోగాలతో బాధపడుతున్నాం. ఒక రోజు మొత్తంలో అలాంటి కదలికలు లేకుండా గడపడం వల్ల బద్దకంగా, నీరసంగా ఉండి రాత్రి సమయంలో నిద్ర పట్టదు. కాబట్టి రోజులో ఎంతోకొంత వ్యాయామం చేయండి. మన శరీరం కదలడానికి డిజైన్ చేయబడి ఉంది. దానికి విరుద్ధంగా ఉంటే మనం రోగాల బారిన పడతాం.

3. మనకి No చెప్పాలని ఉన్నా Yes చెప్పడం : ఇది కూడా సాధారణంగా అందరూ చేసే తప్పు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు no చెప్పాలని ఉన్నా yes చెప్తారు. అలా చెప్పిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేరు. అలా నమ్మకాన్ని కోల్పోయే కంటే no  చెప్పడం చాలా ఉత్తమం. No  చెప్పాలని ఉన్నప్పుడు no  చెప్పడం నేర్చుకోండి. మీరు చెప్పిన no  ఎదుటి వ్యక్తిని కాసేపు మాత్రమే బాధ పెడుతుంది. Yes చెప్పి నిలబెట్టుకోకపోతే అది ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది.

4. నేర్చుకోవడాన్ని వదిలేయడం : చాలామంది నేర్చుకోవడం అనేది కాలేజీ వరకే అని అనుకుంటారు. కానీ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఎన్నో రకాల కొత్త కొత్త విషయాలతో జీవితం చాలా పెద్దది. జ్ఞానం అనంతం. కాలేజ్ తర్వాత కూడా మన నేర్చుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఆధునికంగా ఉంటాము. జీవితం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మన కెరీర్ కూడా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడాన్ని వదిలేయకండి. మీకు ఆసక్తి ఉన్న దేన్నైనా నేర్చుకోండి. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండండి.

5. నిద్ర విషయంలో నిర్లక్ష్యం : జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది మరియు కనీస అవసరం. మనం శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే మనకి నిద్ర చాలా అవసరం. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. సెకండ్ షో చూడడం, పార్టీ , ఇంటర్నెట్ లో సమయం గడపడం కోసం ఇలా చిన్న చిన్న విషయానికి చాలామంది నిద్రని నిర్లక్ష్యం చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే సరిగా నిద్రపోండి. సరైన నిద్ర మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

6. కుటుంబ సభ్యులని పట్టించుకోకపోవడం : ఎలాంటి పరిస్థితుల్లోనైనా, మనం విజయం సాధించినా, సాధించకపోయినా మనతోపాటు ఉండేది కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే. మనం చేసిన తప్పులను మర్చిపోయి మనల్ని ఆనందంగా ఉంచాలని అనుకుంటారు. మీ కోసం ఏమైనా చేస్తారు. మనలో చాలా మంది కుటుంబ సభ్యులను సరిగా పట్టించుకోరు. ఈ తప్పు చేయకండి. వాళ్లు మీతో ఉన్నప్పుడే మీ కుటుంబ సభ్యుల యొక్క విలువ తెలుసుకోండి. వారు మీ కోసం చేసే ప్రతి పనిని అభినందించండి. మీరు వారికి విలువ ఇస్తున్నారు అని తెలిసేలా చేయమంటే మీ కుటుంబ సభ్యుల మీద మీకున్న కృతజ్ఞత చూపించండి.

7. ఇతరులను మార్చాలని ప్రయత్నించటం: మనలో చాలామంది చేసే అస్సలు ఉపయోగం లేని పని ఇది. ఎదుటి వాళ్లు మారితే జీవితం ఇంకా బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. కేవలం వారు మారాలి అనుకుంటేనే ఎవరైనా తమ అలవాట్లు తన జీవితాన్ని మార్చుకుంటారు. మనం చెప్పినంత మాత్రాన ఎవరు మారరు. మనం అస్తమాను అలా చెప్పడం వల్ల వాళ్లు చిరాకుతో ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరులను మార్చడానికి ప్రయత్నించండి. మారాల్సింది మీరే. మీరు ఎలాంటి వ్యక్తి గా మారాలి అనుకుంటున్నా రో అలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. విజయం సాధించండి.

8. శ్రద్ధ పెట్టకపోవడం : ఎదుటివాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఫోన్ చూసుకుంటూ వాళ్ల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టరు. దీనివల్ల ఎదుటి వ్యక్తి తనని పట్టించుకోలేదు అని అనుకుంటాడు. కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టలేనంత పని మీకు ఉంటే ఇది మాట్లాడడానికి సమయం కాదు తర్వాత మాట్లాడదాం అని వారికి చెప్పండి. వారు మాట్లాడుతున్న దానిమీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది వారిని అగౌరవపరిచినట్టు.

9. సోషల్ మీడియాకి మరియు ఇంటర్నెట్ కి బానిస అవ్వడం : ఇది చాలా పెద్ద తప్పు. సోషల్ మీడియాకి బానిస అయితే చాలా సమయం వృధాగా పోతుంది. జీవితంలో అత్యంత విలువైన సమయం దాని విలువను కోల్పోతుంది. జీవితంలో ఎలాంటి లక్ష్యాలు సాధించలేరు.  కాబట్టి మీరు ఎంత సమాజం సోషల్ మీడియా మీద మరియు ఇంటర్నెట్ మీద గడుపుతున్నారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.

10. క్షమించే గుణం లేకపోవడం : ఎదుటి వాళ్ళు చేసిన తప్పులకు వాళ్లని క్షమించ కపోవడం, వాళ్ల మీద కక్ష ఉంచుకోవడం, మన ఆరోగ్యాన్ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తుంది.

మనం చేయకుండా ఉండాల్సిన 10 తప్పులు ఇవే. మనం ఈ 10 తప్పులు చేయకుండా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం,  రిలేషన్ షిప్స్,  ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగుపడతారు. మరియు  ఆనందకరమైన మరియు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి జీవితంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.

ఇతరులు చేసిన తప్పుల నుండి నేర్చుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే అన్ని తప్పులూ చేసే సమయం మీ దగ్గర లేదు. – రూజ్ వెల్ట్

Registration

Forgotten Password?

Loading