అరోమా థెరపీ వల్ల పది ఉపయోగాలు

అరోమా థెరపీ
Share

Essential oils వాడి శరీరం, మైండ్ మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కళని, సైన్స్ ని అరోమా థెరపీ అంటారు. ఈ Essential oils మొక్కల నుండి తీస్తారు. ఈజిప్టు, ఇండియా, గ్రీసు చైనా మొదలైనా దేశాలలో వీటిని అతి పురాతన కాలం నుండే వాడుతున్నారు. 2700 BC లో చైనా లో 365 మొక్కలు వాటి ఔషధ గుణాల గురించి తెలుపుతూ  the Shennong’s Herbal book రాశారు. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఆరోమా థెరఫీని పురాతన కాలం నుండి వాడుతున్నారు.

ఇటీవలి కాలంలో, అరోమాథెరపీకి మళ్ళీ ప్రాముఖ్యత లభిస్తుంది. ఫ్రాన్స్‌లో, అరోమాథెరపీని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు మరియు అరోమాథెరపీలో శిక్షణ పొందిన వైద్యులు వివిధ రోగాలకు చికిత్స చేయడానికి Essential oils వాడతారు . essential oils ను స్పాలలో , ఆసుపత్రులలో, ఇళ్ల వద్ద వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ Essential Oils  సబ్బులు, లోషన్లు, క్లీనర్లను తయారు చేయడానికి మరియు అనేక రకాలుగా ఉపయోగిస్తారు.

Essential Oils ఎలా ఉపయోగించాలో  కొన్ని మార్గాలు ఇప్పుడు చూద్దాం.

1. Inhaler

2. స్నానపు లవణాలు

3. డిఫ్యూజర్స్

4. మసాజ్ కోసం నూనెలు

5. క్రీమ్స్

6. లోషన్లు

7. షాంపూలు

8. ఇంటి శుభ్రపరిచే ఉత్పత్తులు

9. సబ్బులు

10. స్ప్రేలు

11. Potpourri

12. ఓరల్ గా తీసుకోవడానికి

వివిధ రకాల మొక్కల నుండి సేకరించిన 90 కంటే ఎక్కువ రకాల Essential Oils ఉన్నాయి . ఈ నూనెలు ప్రత్యేకమైన లక్షణాలను, సుగంధాలను కలిగి ఉంటాయి మరియు వీటిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

అరోమా థెరపీ యొక్క ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. ఒత్తిడి తగ్గడానికి : అరోమాథెరపీ ఒక అద్భుతమైన ఒత్తిడిని తగ్గించే సాధనం. ఒత్తిడి ఉపశమనానికి మీకు సహాయపడే వివిధ ముఖ్యమైన నూనెలు ఇవి – లావెండర్, రోజ్, య్లాంగ్ య్లాంగ్, బెర్గామోట్, జాస్మిన్, క్లారి సేజ్, బాసిల్, గంధపు చెక్క. మీరు ఈ నూనెలను Bedroom లో చల్లవచ్చు లేదా ఈ నూనెలతో Bathing Salts తయారు చేయవచ్చు.

2. ఆరోగ్యకరమైన చర్మం కోసం: అరోమాథెరపీ అందాన్ని పెంచడానికి మరియు చర్మం యొక్క యవ్వనాన్ని మెరుగుపరచానికి ఉపయోగపడుతుంది. వయసు పెరగడం నిరోధించడానికి మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన నూనెలు ఇవి – రోజ్, మైర్, జోజోబా, లావెండర్, ఫ్రాంకెన్సెన్స్, నెరోలి, క్లారి సేజ్, ప్యాచౌలి. దయచేసి ఈ నూనెలు మీ చర్మంపై నేరుగా రాయవద్దు. ఎందుకంటే అవి చాలా శక్తివంతమైనవి మరియు చర్మం దద్దుర్లు వస్తాయి . ఈ నూనెలను బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా గోధుమ నూనె లేదా కొబ్బరి నూనె వంటి నూనెలతో కలపండి. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్, మచ్చలు వంటి ఇతర చర్మ సమస్యలకు కూడా Essential Oils ఉపయోగించవచ్చు.

3. జుట్టు పెరగడానికి: అరోమా థెరపీ జుట్టు పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది. Lavender , Peppermint , Rosemary , Cedarwood , Lemongrass , Thyme , Clary sage , Tea Tree , Ylang Ylang ఇవి జుట్టు పెరుగుదలలో చాలా ఉపయోగపడతాయి. ఈ నూనెలను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకి రాయండి. ఎలాంటి హానికర రసాయనాలు లేకుండా ఈ నూనెలను ఉపయోగించి ఇంటివద్దనే షాంపూ తయారు చేసుకోవచ్చు.

4. ఆనందాన్ని ఇచ్చే సాధనం : అరోమా థెరపీ హ్యాపీ మూడ్ ఉండేలా చేస్తుంది, ఇది చుట్టూ సానుకూలత మరియు ఉత్సాహ భావనలను ప్రోత్సహిస్తుంది. ఉత్సాహాన్ని ఇచ్చే essential oils – నిమ్మ, క్లారి సేజ్, లావెండర్, క్లారి సేజ్, స్వీట్ ఆరెంజ్, పిప్పరమింట్, వెటివర్, రోజ్మేరీ, ప్యాచౌలి. ఈ నూనెలను ఇంట్లో డిఫ్యూజర్ లో వాడవచ్చు.

5. ఇంటిని శుభ్రం చెయ్యడానికి : Essential oils ను ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కూడా వాడవచ్చు. ఎలాంటి రసాయనాలు లేకుండా హోమ్ క్లీనర్స్ తయారు చేసుకోవచ్చు. Lemon, Tea tree , Lavender , Eucalyptus , Orange , Peppermint , Pine , Thyme వీటితో ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్ తయారు చేసుకోవచ్చు.

6. నయం కావడానికి : Essential oils ను జలుబు, తలనొప్పి, కాలిన గాయాలు మొదలైన వాటికి వాడవచ్చు. వైద్య ప్రయోజనాల కోసం వాడే essential oils – లావెండర్, యూకలిప్టస్, టీ ట్రీ, పిప్పరమెంటు మొదలైనవి. ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ వీటిని పూయవచ్చు.

7. స్నానానికి వాడే లవణాలు: Essential oils తో Bathing salts తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా తాజాగా ఉంటాయి.

8. Insomnia : నిద్రలేమిని ఎదుర్కోవడంలో essential oils సహాయపడతాయి. నిద్రలేమికి సహాయపడే కొన్ని ముఖ్యమైన నూనెలు – లావెండర్, స్వీట్ మార్జోరం, చమోమిలే, పిప్పరమెంటు, గంధపు చెక్క, మల్లె, గులాబీ, జెరేనియం, య్లాంగ్-య్లాంగ్, సెడర్‌వుడ్, సిట్రస్, బెర్గామోట్.

9. నొప్పి : ఇవి నొప్పిని తగ్గిస్తాయి .

10. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను పెంచుతాయి

Essential oils వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి.

Essential oils ను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఈ క్రింద ఉన్నాయి

1. Essential oils ను చర్మం లేదా జుట్టు మీద నేరుగా ఉపయోగించవద్దు. అవి చాలా శక్తివంతమైనవి మరియు నేరుగా ఉపయోగించినప్పుడు దద్దుర్లు వస్తాయి. ఎప్పుడూ నూనెలో కలిపి మాత్రమే వాడండి. నూనెలో ఎలా కలపాలో ఇప్పుడు చూద్దాం.

1. పెద్దలకు 30 మి.లీ నూనెలో 12 చుక్కల essential oil వాడండి.

2. పిల్లలకు కుంచెం ఎక్కువ నూనెను వాడండి- 1 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు 30 మి.లీ నూనెలో 6 చుక్కలు మరియు 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 30 మి.లీ నూనెలో 2 చుక్కలు essential oils వాడండి.

3. 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు essential oils ఉపయోగించవద్దు.

2. Essential oils లో మూడు రకాల గ్రేడ్ లు ఉన్నాయి, అవి

చికిత్సకి వాడే వర్గం: ఈ గ్రేడ్ నూనెలు స్వచ్ఛమైన మొక్కల నుండి తీస్తారు. మరియు తాజా మొక్కల వాసనతో సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువ వీటినే వాడాలి.

కాస్మోటిక్స్ లో వాడే వర్గం: వీటిని లాబ్స్ లో కృత్రిమంగా తయారు చేస్తారు. ఇవి చర్మానికి ఎలాంటి హానీ చెయ్యవు కానీ మొక్కలకి సంబంధించినవి ఉండకపోవచ్చు.

సుగంధ ద్రవ్యాలలో వాడే వర్గం: వీటిని కృత్రిమంగా లాబ్స్ లో రసాయనాలు వాడి తయారు చేస్తారు. ఇవి చాలా అనారోగ్యకరం. వీటిని అస్సలు వాడకూడదు.

3. సహజమైన essential oils కృత్రిమంగా చేసిన ఆయిల్స్ కన్నా తక్కువ వాసన కలిగి ఉంటాయి. కృత్రిమమైన ఆయిల్స్ మంచి వాసన మరియు గాఢత కలిగి ఉంటాయి. మంచి ఆరోగ్యం కోసం సరైనవి ఎంచుకోండి.

4. Essential oils చాలా గాఢంగా ఉంటాయి. నూనెలో కలపకుండా వాడితే చాలా హానికరం. కాబట్టి పిల్లలకి, పెంపుడు జంతువులకి దూరంగా ఉంచండి.

5. Essential oils నీటిలో కరగవు. నీటిలో నేరుగా కలిపితే నీటిపై ఒక పొర లాగా తేలుతూ ఉంటాయి. ఆ నీటిని స్నానానికి వాడితే దద్దుర్లు, దురదలు వస్తాయి. కాబట్టి essential oils ను నీటిలో కలిపి వాడకండి.

6. Essential oils ను కళ్ళకి, చెవులకి దూరంగా ఉంచండి. ఒకవేళ పొరపాటున కళ్ళకి చెవులకి ఇవి అంటుకుంటే వెంటనే మంచి నీటితో కడగండి.

Essential oils ఉపయోగిస్తున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి. అరోమాథెరపీ చాలా గొప్పది, ఇది రోజువారీ జీవితంలో అందం నుండి ఆరోగ్యం వరకు ఒత్తిడి-ఉపశమనం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మరిన్ని విషయాలు త్వరలోనే తెలుసుకుందాం.

Registration

Forgotten Password?

Loading