విజయం సాధించడానికి సామర్థ్యంలో ఉన్న నాలుగు దశలు

విజయం
Share

మీకు ఏమి కావాలో తెలుసుకోవడం, ఎందుకు కావాలో తెలుసుకుని అది సాధించడానికి  మరియు చర్యలు తీసుకోవడం, లక్ష్యాలను సాధించడంలో మూడు ప్రాథమిక దశలు. కొన్నిసార్లు ఈ మూడు ఈ స్టెప్స్ పాటించినా కూడా ఫలితాలు రావు. మనందరికీ గెలవాలని ఉంటుంది. మన రిలేషన్స్ విషయంలో గానీ, వర్క్ , ఆరోగ్యం ఇలా మన లక్ష్యం ఏదైనా మనకి ఏం కావాలో తెలుసు, ఎందుకు కావాలో తెలుసు, దాని కోసం కష్టపడతాం. కానీ ఎందుకు ఫెయిల్ అవుతాం? లోపం ఎక్కడ ఉంది? మనం ఏం మర్చిపోతున్నాం? మన మర్చిపోతున్నది సామర్థ్యం  మరియు నైపుణ్యం.  మనం సాధించాలి అనుకున్న దానికోసం కష్టపడడం అవసరమే కానీ మనకి సరైన నైపుణ్యం లేకుండా ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు. అప్పుడు మనం అనుకున్నది సాధించలేము.

విజయం సాధించాలంటే ముఖ్యమైనది నైపుణ్యం. సాధించాలనే కోరిక మాత్రమే సరిపోదు. దానితో పాటు నైపుణ్యంతో కూడిన కష్టం కూడా తోడవ్వాలి. విజయం సాధించాలంటే కష్టం ఒక్కటే సరిపోదు. ఆ కష్టానికి నైపుణ్యం మరియు సామర్థ్యం  కలిసినపుడు మనం విజయం సాధించగలం. సాధించాలని ఉండడం, సాధించడానికి అవసరమైన నైపుణ్యం కలిగి ఉండడం రెండూ వేరు వేరు విషయాలు. సాదించాలనే ఉద్దేశానికి, నైపుణ్యానికి మధ్య అంతరమే మన లక్ష్యాలు సాధించకుండా ఆపుతుంది. మన లక్ష్యాన్ని సాధించాలనుకుంటాం. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలనీ, మంచి రిలేషన్ షిప్స్ ఉండాలనీ ఇలా ఏదైనా సరైన నైపుణ్యం లేకపోతే మనం అనుకున్నది సాధించలేము.

మనం అదృష్టవంతులు అని పిలిచే చాలామంది క్రమశిక్షణ, దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఎంతో కష్టపడి నైపుణ్యం సాధిస్తారు. వాళ్ళు అదృష్టం వల్ల సాధించగలిగారు అని మనం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే వాళ్ళ క్రమశిక్షణ, నైపుణ్యం, వైఖరి వాళ్ళని విజయం సాధించేలా చేస్తాయి.

నైపుణ్యం పెంచుకోవడం, మనం ఎంచుకున్న రంగంలో గొప్పవారు అవ్వడం మన చేతుల్లోనే ఉంటుంది. దానికి క్రమశిక్షణ, ఓపిక, మనస్పూర్తిగా కష్టపడడం కావాలి. కేవలం కొన్ని రోజుల్లోనో, లేదా రాత్రికి రాత్రికి విజయం వచ్చేయదు. సమయం పడుతుంది. మన నైపుణ్యం పెంచుకోవడానికి కాస్త సమయం పడుతుంది ఎందుకంటే దానినుండి వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. మనలో నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని  ఎలా పెంచుకోవాలి ?

సామర్థ్యం  పెంచుకోవడానికి నాలుగు దశలు ఉంటాయి.

ఉదాహరణకి రాహుల్ ఒక మంచి గిటారిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుందాం. ఇప్పుడు అతను సామర్థ్యం పెంచుకునే దశలను ఇప్పుడు చూద్దాం.

మొదటి దశ : సామర్థ్యం  లేదని తెలియకపోవడం  :  ఈ దశలో తనకి తెలియదన్న విషయం ఆ వ్యక్తికి తెలీదు. రాహుల్ కి గిటార్ ప్లే చెయ్యడం అనే సామర్థ్యం  లేదని తనకి తెలీదు. కనీసం తాను గిటార్ నేర్చుకోవాలి అని కూడా అనుకోడు. ఎందుకంటే తనకున్న నైపుణ్యం సరిపోదు అనే విషయం తనకి తెలీదు. తనకి కావాల్సినంత నాలెడ్జ్ ఉంది అనుకుంటాడు. తనకి గిటార్ అంటే ఇష్టం కాబట్టి మంచి గిటారిస్ట్ అవ్వాలనుకుంటాడు. అతను ఖచ్చితంగా అవ్వగలడు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ తనకి నైపుణ్యం, సామర్థ్యం  లేదని రాహుల్ ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే అది సాధ్యమవుతుంది. అతను తన నైపుణ్యానికి పదును పెట్టుకోవాలి. అప్పుడు రాహుల్ తర్వాతి దశకి వెళ్తాడు.

రెండవ దశ : ఈ దశలో తనకి తెలీదన్న విషయాన్ని అతను గుర్తిస్తాడు. రాహుల్ తనకున్న నైపుణ్యం సరిపోదనీ ఇంకా ఎంతో నేర్చుకోవాలని తెలసుకుంటాడు. ఒక మంచి గిటారిస్ట్ అవ్వాలంటే ఎంతో శ్రమ, సమయం అవసరమని రాహుల్ కి అర్థమవుతుంది. చాలామంది కొత్తవాళ్ళు ఇక్కడే ఆగిపోతారు. ఇది తెలుసుకున్న తర్వాత అంత కష్టపడడం మనవల్ల కాదులే అనుకుని ఆగిపోతారు. చాలా తక్కువమంది, ఎవరైతే కష్టపడడానికి సిద్దపడతారో వాళ్ళు తర్వాతి దశకి వెళ్తారు.

మూడవ దశ : తెలిసిన సామర్థ్యం : ఈ దశలో తనకు సామర్థ్యం  ఉందని తనకి తెలుస్తుంది. రాహుల్ గిటార్ కొంత నేర్చుకుంటాడు. గిటార్ ప్లే చెయ్యగలడు. కానీ చాలా సమయం మరియు శ్రమ అవసరం. గిటార్ ప్లే చెయ్యడం చాలా ఛాలెంజింగ్ గా,  ఆతృత గా ఉంటుంది. కాస్త పర్ఫెక్ట్  గా లేకుండా ఉంటుంది. నేను ఎప్పుడైనా పర్ఫెక్ట్  గా ప్లే చేశానా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. చాలా నిరుత్సాహ పడిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ దశలో వదిలేస్తారు. కానీ దృఢమైన సంకల్పంతో, క్రమశిక్షణ తో ఓపికగా ఎదురుచూసే కొంతమంది మాత్రమే తర్వాతి దశకి వెళ్తారు.

నాల్గవ దశ : సామర్థ్యం ఉందని తెలియకపోవడం: ఈ దశలో తనకి సామర్థ్యం  ఉందని తనకి తెలీదు. ఇదే అసలైన దశ. రాహుల్ పెద్ద శ్రమ పడకుండా అద్బుతంగా గిటార్ ప్లే చేస్తాడు. అందరూ అతను పుట్టుకతోనే గిటార్ ప్లే చెయ్యడం అనే బహుమతితో పుట్టాడు అనుకుంటారు. గిటార్ ప్లే చెయ్యడం తనకి చాలా తేలిక అన్నట్టు అయిపోతుంది. అతను ఎంతోమంది కి ప్రేరణగా నిలుస్తాడు. గిటార్ లో అతనికి ఉన్న నైపుణ్యం వల్ల చాలా విజయాలు సాధిస్తాడు. ఇప్పుడు రాహుల్ ఒక గొప్ప  గిటారిస్ట్.

ఇవి సామర్థ్యం  లో ఉన్న దశలు. గొప్ప గొప్ప కంపెనీలు, గొప్ప విజయాలు సాధించిన వారు ఈ అన్ని దశలు చూసినవారే. ఎంతో కష్టపడి క్రమశిక్షణతో నాల్గవ దశకి వెళ్తారు. ఇదంతా అదృష్టం వల్ల రాత్రికి రాత్రి జరగదు.

ఈ మార్గంలో నడవాలంటే మనం పాటించవలసిన సూత్రాలు ఇప్పుడు చూద్దాం.

1. మనస్పూర్తిగా నిరంతర ప్రయత్నం: మనం ఎందులోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర ప్రయత్నం ఉండాలి. అప్పుడప్పుడు చెయ్యడం వల్ల ఎవ్వరూ నైపుణ్యం సాధించలేరు.

2. మీ లక్ష్యం, మీ నైపుణ్యం ఒకే దారిలో ఉండడం: మీ లక్ష్యం మరియు మీ నైపుణ్యం ఒకే దారిలో ఉండడం చాలా ముఖ్యం. మీ లక్ష్యం ఒక మంచి రైటర్ అవ్వడం అయితే మీ నైపుణ్యం రైటింగ్ లోనూ మరియు మార్కెటింగ్ లోనూ పెంచుకోవాలి తప్ప వేరే దానిలో కాదు.

3. ఓపికగా సామర్థ్యం లో ఉన్న అన్ని దశలు దాటాలి. ఈ ప్రయాణంలో ఓపిక చాలా అవసరం.

4. పాసిటివ్ దృక్పధం: దీనివల్ల మధ్యలో ఎన్ని సమస్యలు ఎదురైనా మీరు మీ లక్ష్యానికే కట్టుబడి ఉంటారు. కొన్నిరోజు మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు అనిపించవచ్చు. వదిలేద్దాం అనిపించవచ్చు. మనలో ఎదురయ్యే ఇలాంటి ఆలోచనలను దాటడానికి పాసిటివ్ దృక్పధం చాలా ఉపయోగపడుతుంది.

సామర్థ్యాన్ని పెంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి సామర్థ్యం  పెంచుకుని మీరు అనుకున్నది సాధించండి.

Registration

Forgotten Password?

Loading