మన జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత

ప్రార్థన
Share

ఆ దేవుడు మనల్ని సృష్టించిన శక్తి. మన మైండ్ లో,  మన వ్యక్తిత్వంలో నిండి ఉన్నాడు. మనకి ఎంతో శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఈ శక్తులను మరింత మెరుగు పరుచుకోవడానికి ప్రార్థన సహాయపడుతుంది. ” – అబ్దుల్ కలాం.

మీరు ఏ మతం నుంచి వచ్చినవారైనా పాత రోజుల్లో ప్రార్థించడం అనేది అందరి ఇళ్లలోనూ జరిగేది. మన పెద్ద వాళ్ళు మనకి ప్రార్థన చేయడం నేర్పుతారు. మత పరంగా  కొన్ని ప్రార్థనా  సమయాలను పాటించడానికి కారణం ప్రార్థనని మన జీవితంలో ఒక భాగం చేయడమే.

ప్రార్థన చేయకుండా వారు భోజనం కూడా చేసేవారు కాదు. ప్రార్థన చేయకుండా పనులకు కూడా వెళ్లేవారు కాదు. దేవుడి విషయంలో వాళ్ళ నమ్మకాలు అలా ఉండేవి.

ప్రస్తుత పరిస్థితులకు వస్తే మనలో చాలా మందికి దేవుడికి ప్రార్థన చేయడం అంత ఇష్టం ఉండదు. దైవంతో అనుసంధానం అవ్వడానికి మనం పెద్దగా సమయం వెచ్చించం. పండగలప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి ప్రార్థన చేయడం ప్రస్తుత తరానికి అలవాటు. ప్రతిరోజు దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి ? దైవం ఎందుకు మన జీవితంలో ఒక భాగం ?

ప్రార్థన గురించి కొన్ని సూచనలు ఇక్కడ చూద్దాం.

1. దైవాన్ని ఏ పేరు పెట్టయినా పిలవచ్చు. సృష్టికర్త, దేవుడు లేదా విశ్వం. ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటి మాత్రం నిజం. ఈ సృష్టి వెనకాల అనంతమైన శక్తి ఉంది. ఈ భూమ్మీద కోట్ల జంతువులు ఉన్నాయి.  మరియు కొన్ని బిలియన్ల మనుషులు ఉన్నారు. ఇంతమందిలో ఎవరికి వారు ప్రత్యేకంగా ఉండడం ఎలా సాధ్యమైంది ? దేవుడు మాత్రమే అది చేయగలడు. అనంతమైన సృజనాత్మకతకి దైవం మూలం. మనం రోజు దేవుడికి ప్రేయర్ చేస్తే ఆ అనంతమైన శక్తిలో మనం ఏకం అవుతాం. మనకి రోజు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలు వస్తాయి. మన ప్రార్థనలు పరిష్కారాలు ఇస్తాయి.

2. మన శరీరంలో చాలా జ్ఞానం ఉంది.మన శరీరంలోని కణాలు ఎలాంటి సూచనలు లేకుండానే వాటికవే పనిచేస్తాయి. మన శరీరంలో ఎన్నో పనులు వాటికవే జరుగుతాయి. మన శరీరంలోనే కాదు, ఈ ప్రకృతిలో ప్రతిదీ గొప్ప జ్ఞానం తో దానికి అదే జరుగుతుంది. చీమల్లో, చెట్లలో, కీటకాలలో, జంతువుల్లో మరియు మనుషుల్లో విజ్ఞానాన్ని మనం చూస్తాం. మన శరీరానికి, ఆ చీమలకి ఎవరూ ఈ జ్ఞానాన్ని నేర్పలేదు. ఈ జ్ఞానానికి మూలం దైవం. మనం ప్రార్థన చేస్తే దైవం యొక్క జ్ఞానంతో అనుసంధానమయ్యి మన శరీరంలోకి, మైండ్ లోకి, ఆత్మ లోకి మరింత జ్ఞానాన్ని వచ్చేలా చేస్తుంది.

3. మన శరీరంలో, ఎమోషన్స్  లో,  ఆలోచనల్లో,  మనం మాట్లాడే మాటలలో చాలా గొప్ప శక్తి ఉంది. మనలో ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని గొప్పగా మార్చగలరు. మనలో ప్రవహించేది ఆ దైవం యొక్క శక్తి. మనం ఆ దైవంతో అనుసంధానం అయినప్పుడు గొప్ప ఆలోచనలు,  ఎమోషన్స్ ,  మనం మాట్లాడే మాటలు ఈ ప్రపంచం మీద ఒక సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.

4. దేవుడు మూడు ముఖ్యమైన విషయాల సమ్మేళనం. ప్రేమ, జ్ఞానం మరియు శక్తి. మనం ఆరోగ్యంగా, సమృద్ధిగా, ప్రశాంతంగా, మంచి రిలేషన్ షిప్ తో ఉండాలంటే మనకి ఈ మూడు అవసరం. మనం ప్రేయర్ చేసినప్పుడు ఈ మూడు లక్షణాలు మనలోకి ప్రవహించేలా ఆ దేవుడు చేస్తాడు.

5. దేవుడు అనంతమైన శక్తికి మూలం. జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. కొన్నిసార్లు మనం విఫలం కావచ్చు.  నిరాశ పడొచ్చు.  మనం దేవుని తో అనుసంధానమై ఉన్నప్పుడు మనలో అద్భుతమైన ఆంతరంగిక శక్తి నిండిఉండి జీవితంలో ఏది ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము.  ఈ అంతర్గత శక్తి కష్ట సమయాల్లో దృఢంగా ఉండడానికి మనకు సహాయపడి ఎన్నో అవాంతరాలను దాటేలా చేస్తుంది.

6. మనందరికీ చుట్టూ ఒక Aura ఉంటుంది. ఆ Aura లో  ఆలోచనలు, ఎమోషన్స్   మరియు శక్తి నిండి ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసినప్పుడు ఆ Aura శుభ్రపడుతుంది.  దృఢంగా మారుతుంది. అలాంటి Aura మనకి ఎన్నో లాభాలు చేకూర్చుతుంది.  ఆలోచనలో స్పష్టత వస్తుంది.  మానసిక ప్రశాంతతను రోగనిరోధకశక్తిని సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది.

7. మనలో చాలామంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి ప్రార్థన చేస్తారు. దేవుడు అద్భుతాలు చేసి వాళ్ళ కష్టాలని తొలగిస్తాడని అనుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే దేవుడు మనకి ఆలోచనలు, శక్తి, జ్ఞానం ఇచ్చి మన సమస్యలను మనమే పరిష్కరించుకునేలా  చేస్తాడు. ఆలోచనలకు తగినట్టు ప్రవర్తించడం మన బాధ్యత. దేవుడు మనకి శరీరాన్ని ఆత్మను ఇచ్చాడు వాటి ద్వారా మనకు కావలసిన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు. మనం బద్ధకంగా పడుకుని లేదా టీవీ చూస్తూ గడిపేస్తూ దేవుడే నేరుగా వచ్చి మీ సమస్యలను తీసేస్తాడు అనుకోవద్దు. దేవుడు మనకి  అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటి మీద పనిచేయడం అది మన బాధ్యత.

8. చాలా మంది జీవితంలో దేవుడికి భయం వల్ల ప్రేయర్ చేస్తారు. దేవుడు చాలా దయ గలిగిన వాడు మరియు ప్రేమ కలిగిన వాడు. దేవుడి నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీని తీసుకోకుండా భయం అడ్డుకుంటుంది. భయానికి బదులు ప్రేమ, కృతజ్ఞత మరియు అర్థం చేసుకునే తత్వాన్ని నింపుకోవాలి. మనం చేసే ప్రార్థనలు ప్రభావవంతంగా గా జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి.

9. కొన్నిసార్లు తెలియకుండానే మనం నెగిటివ్ ఆలోచనలు ఎదుర్కొంటాం. మనం ప్రతి రోజూ దేవుడికి ప్రేయర్ చేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పోయేలా చేసి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు.

10. మనకి రోజు ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన శక్తి మొత్తం అయిపోతుంది. దేవుడు లేదా విశ్వం మనం మళ్లీ నూతన శక్తితో నిండడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రార్థన చేయడం అనేది ఆధ్యాత్మికంగా స్నానం చేయడం లాంటిది. ఇది మన ఆత్మని నూతన శక్తితో నింపి రోజు ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది.

11. దేవుడు అనంతమైన శక్తికి మూలం. ఆ శక్తిని ప్రతిరోజు ఆస్వాదించడం చాలా తెలివైన పని. అంత గొప్ప శక్తిని పట్టించుకోకుండా ఉండడం చాలా తెలివి తక్కువ పని. ఇలాంటి ఖర్చులేకుండా మనల్ని రోజు సరైన మార్గంలో నడిపే శక్తితో అనుసంధానం అయి ఉండటం చాలా ముఖ్యం.

12. ప్రార్థనకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఇది. ఇప్పుడు ప్రార్ధన ఎలా చేయాలి ? ప్రతి మతంలోనూ ఒక ప్రత్యేకమైన ప్రార్ధనా విధానం ఉంటుంది.  దీని మీద ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిలో నుంచి మీకు నచ్చినది ఏదైనా ఎంచుకోవచ్చు. కొత్తవాళ్ళు ప్రార్థన చేయడానికి సులువైన మార్గం ఇప్పుడు చూద్దాం.

1. సరైన పద్ధతిలో కూర్చోండి.

2. ఒక రెండు మూడు సార్లు లోతుగా శ్వాస తీసుకుని మీ ఆలోచనల్ని భావోద్వేగాన్ని అదుపు చేయండి.

3. మీకు నచ్చిన రూపంలో దేవుడు గురించి ఆలోచించండి.

4. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి. మిమ్మల్ని నడిపించమని మరిన్ని ఆశీర్వాదాలు ఇవ్వమని అడగండి. కష్టపడే తత్వం, కరుణ, దయ, జ్ఞానం ఇలాంటి లక్షణాలు ఇవ్వమని అడగండి. మీకు మిమ్మల్ని బాధించే ఏదైనా ఉంటే దాని గురించి చెప్పి సహాయం చేయమని అడగండి. మీకు మంత్రాలు వస్తే వాటి ద్వారా లేదంటే మీకు నచ్చిన విధంగా మాట్లాడుతూ ప్రార్థన చేయండి.

5. మీ ఆలోచనల్లో భావోద్వేగాలను మాటలలో మీరు చేసే పనులు ఆ దేవుడిని ఉండమని అడుగుతూ మీ ప్రార్థనను ముగించవచ్చు.

మీరు ఎప్పుడైనా సులువుగా ప్రార్థన చేసే విధానం ఇది.

మీ ప్రార్ధన ని మరింత ప్రభావంతంగా చేయడానికి మరికొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. గానుగలో ఆడిన నూనె లేదా ఆవునెయ్యితో ఒక చిన్న దీపం వెలిగించండి. మార్కెట్లో దొరికే ఏదిబడితే అది వాడొద్దు. వాటివల్ల దీపం పెట్టడం అనే పని వెనుక ఉన్న ఉద్దేశ్యం పాడవుతుంది. ఆవు నెయ్యి చాలా మంచిది. ఆవునెయ్యితో దీపం పెడితే అది gold energy విడుదల చేస్తుంది. దానితో పాటు మన ప్రార్థన కూడా జోడిస్తే ఇంటి నిండా ఒక పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. గానుగలో ఆడిన నూనెలు కూడా చాలా బాగుంటాయి.

2. దేవునికి కృతజ్ఞతగా మీరు ఏదైనా సమర్పించవచ్చు. ఒక చిన్న పండుని గానీ, పువ్వు గాని లేదా ఏదైనా తినే పదార్థం గానే సమర్పించండి.

3. మీరు ఎంతసేపు ఎంత ఎక్కువ ప్రార్థన చేశారు అనేది ముఖ్యం కాదు. మీరు ప్రార్థన చేస్తుండగా ఎంత awareness ఉన్నారు అన్నది ముఖ్యం. ప్రార్థన చేస్తుండగా మనస్ఫూర్తిగా ఆ క్షణంలో ఉండండి.

4. కుదిరితే ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే చోట ప్రార్థన చేయండి. అది మీ ప్రార్థనని మరింత ప్రభావం చేస్తుంది.

5. రోజుకు రెండుసార్లు ప్రార్థన చేయండి.

మీ రోజువారీ దినచర్యలో ప్రార్థనని ఒక భాగం చేయండి.

ప్రార్థన చేయడానికి అవసరమైన సూచనలు ఇవి. మీ జీవితం మరింత గొప్పగా మారడానికి అవధులు లేని శక్తి స్వరూపమైన దేవుడి తో అనుసంధానమై ఉండండి. చిన్న ప్రార్థన మీ జీవితానికి గొప్ప విలువను ఇస్తుంది. ప్రతిరోజు ప్రార్థన మిమ్మల్ని మెరుగైన వ్యక్తి గా మారుతుంది. దేవుడు ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తాడు.  మనం ప్రార్థన చేసినా,  చేయకపోయినా మనం సహాయం అడిగితే గాని ఆయన మన జీవితంలోకి రాడు. ఆయనతో అనుసంధానం అవ్వాలా లేదా అన్నది మీ నిర్ణయం. దైవంతో అనుసంధానం సృజనాత్మకతని, జ్ఞానం,  శక్తిని, ప్రేమని ఇస్తుంది.

ప్రార్థన ముసలి వాళ్ళ చాదస్తం కాదు. సరిగా అర్థం చేసుకుని పాటించడం నేర్చుకుంటే మనం చేసే ప్రతీ పనిలో  అద్భుతమైన పనిముట్టులా ప్రార్థన పనిచేస్తుంది. – మహాత్మా గాంధీ

Registration

Forgotten Password?

Loading