మీ జీవితాన్ని ఈ క్షణమే మార్చుకోవడానికి 5 సూచనలు

నీ జీవితాన్ని మార్చుకో
Share

మీ జీవితం గురించి బాధ పడుతున్నారా ? ఓడిపోయిన వ్యక్తిలా ఫీల్ అవుతున్నారా ? మీ జీవితం ఎలా మార్చుకోవాలో తెలియట్లేదా? ఆరోగ్య సమస్యలు, డబ్బు, రిలేషన్ షిప్ సమస్యలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా? ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో మీకు అర్థం కావట్లేదా ? ఇలాంటి సమస్యలు జీవితంలో ఒక అర్థం కాని పజిల్ లా వస్తూనే ఉంటాయి. పెళ్లి అవడం, పిల్లలు పుట్టడం ప్రమోషన్ రావడం ఇలా చాలా సందర్భాల్లో జీవితం ఒక ఛాలెంజ్ లా ఉంటుంది.

యోగ, మెడిటేషన్, మంచి ఆహారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇలా మనం చాలా విషయాల గురించి తెలుసుకుంటాం. మనలో చాలా మంది జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే వీడియోలు చూస్తారు. పుస్తకాలు చదువుతారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎన్నో రకాల కోర్సులు జాయిన్ అవుతారు. ఇన్ని చేసిన తర్వాత కూడా మన జీవితంలో మళ్లీ పాత సమస్యలు ఉంటాయి. ప్రేమించిన వ్యక్తులతో గొడవలు జరుగుతూనే ఉంటాయి.  ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ ఉంటుంది.  డబ్బు మన చేతిలో నుంచి జారి పోతూ ఉంటుంది.  ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ?

మనం ఎన్నో సంవత్సరాలనుంచి కష్టపడుతున్నట్టు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి జీవితం ఎన్నో సమస్యలతో నిండి ఉంది అనిపిస్తుంది. సంవత్సరాలు మారుతున్నా జీవితం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఎందుకు ఉంటుంది ? మన జీవితం గొప్పగా మారక పోవడానికి ఉన్న 7 కారణాలు ఇప్పుడు చూద్దాం.

1. మనకి తెలిసిన మంచి విషయాలని ప్రాక్టీస్ చేయకపోవడం : మనకి ఎన్ని విషయాలు తెలుసు అనేదానిమీద మన జీవితం ఆధారపడి ఉండదు. మనకి తెలిసిన దాన్ని ఎంత వరకు పాటిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది తెలుసుకోవడంని పాటించటం అనే భ్రమలో ఉంటారు. తెలుసుకోవడానికి తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంతో తేడా ఉంది. మనం ఆచరించినప్పుడు మాత్రమే దాని నుండి వచ్చిన సత్ఫలితాలను పొందగలము. మీకు కేవలం పది విషయాలు మాత్రమే తెలుసు అనుకుందాం. కేవలం వాటిని ఆచరించినా, 100 విషయాలు తెలిసినా ఆచరించని వ్యక్తి కన్నా మీ జీవితం గొప్పగా ఉంటుంది.

2. మధ్యలోనే వదిలేయడం : యోగ లేదా మెడిటేషన్ లాంటివి నేర్చుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తారు. కానీ కొన్ని రోజుల్లోనే వాటిని మర్చిపోయి వారి పాత అలవాట్లు కి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు ఆచరించి మనం దాన్ని మధ్యలో వదిలేస్తే దాని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మన మన జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా ఉంటుంది.

3. ఎక్కువ కొత్త కొత్త విషయాలు ప్రయత్నించడం : కొన్నిసార్లు మనం చాలా కొత్త కొత్త అలవాట్లు చేసుకోవాలని ప్రయత్నిస్తాం. అన్ని ఒకేసారి నేర్చుకోవాలి అనుకుంటాం. అందువల్ల వాటిని ఎక్కువకాలం కొనసాగించలేము. కొన్ని రోజులు చేసిన తరువాత మధ్యలో వదిలేస్తాం. మళ్లీ మొదటికి వస్తాం.

4. అద్భుతాల కోసం ఎదురుచూడడం : కొంతమంది జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు గ్రహాలు మారి దేవుడు తాము అనుకున్న కోరికలు తీరుస్తాడని ఆశిస్తూ ఉంటారు. వాళ్ల జీవితం మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు. మన జీవితాన్ని కేవలం మనం మాత్రమే మార్చగలం అని గుర్తుంచుకోవాలి. మన పనులు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలవు. ఎవరైతే తమకి తాము సహాయం చేసుకుంటారో వారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు.

5. ఇతరులని మార్చాలని ప్రయత్నించడం : కొంతమంది ఇతరులను మార్చడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి సమయం మరియు ఎనర్జీ భార్య ని మార్చడానికి, భర్త ని మార్చడానికి, తల్లిని మార్చడానికి, పిల్లల్ని మార్చడానికి ఇస్తారు. వారి ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితం మీద శ్రద్ధ పెడతారు. వాళ్ల జీవితం మారితే వీళ్ళ జీవితం మారుతుంది అని అనుకుంటారు. మీరు ఎంత ప్రయత్నించినా ఎదుటివాడు మారరు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళు తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. ఈ గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.

6. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేయడం : మనం అందరం జీవితం లో తప్పులు చేస్తాం. కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే మన జీవితం ముందుకు వెళ్ళదు. నా జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదు అదే సమస్య ఎప్పుడూ ఉంటుంది. చేసిన ప్రతి తప్పు నుండి ఒక మంచి విషయం నేర్చుకునే వాటిని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడితే జీవితం చాలా అభివృద్ధి చెందుతుంది.

7. ఎదుటి వాళ్ళని నిందించడం : కొంతమంది వాళ్ళ సమస్యలకి ఎప్పుడూ ఎదుటి వాళ్లే కారణం అని నిందిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు భార్యని అత్తమామలను పిల్లలని బాస్ ని వాళ్ళ సమస్యలు కి కారణం అని అంటూ ఉంటారు. వాళ్ల జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది అని వారు ఒప్పుకోరు. వారి ఆనందం లేదా దుఃఖం వారి చుట్టూ ఉన్న వాళ్ల చేతుల్లో ఉంది అని అనుకుంటూ ఉంటారు. జీవితమంతా ఎదుటివాళ్ళని నిందిస్తూ నే ఉంటారు.

జీవితం ఏమాత్రం అభివృద్ధి చెందకపోవడానికి కారణం అయ్యే 7 కారణాలు ఇవి.

మీ జీవితాన్ని ఇప్పుడే మార్చుకోవడానికి 5 సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ అది మీ జీవితంలో ఒక భాగం అయ్యేలా చేసుకోండి. అది ఏదైనా పర్లేదు. చాలా తేలికైనది అయినా లేదా కష్టమైనది అయినా పర్లేదు. నేర్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. కాబట్టి మీకు నచ్చిన దానిని ఏదైనా తీసుకోండి. ప్రతి రోజు ఆ పని చేస్తూ దానిని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. కొన్ని నెలల తర్వాత మరొక దాన్ని తీసుకుని దాన్ని కూడా మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఇలా చేస్తే అనేక కొత్త అలవాట్లు మీ జీవితంలో భాగం అయ్యి మీ జీవితాన్ని చాలా గొప్ప గా మారుస్తాయి.

2. మీరు గతంలో చేసిన తప్పులను చూసి ఏం నేర్చుకోవాలో ఆలోచించండి. వాటినుండి మీరు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. దానివలన అదే తప్పు మీరు మళ్లీ మళ్లీ చేయకుండా ఉంటారు.

3. ఇతరులను మార్చడానికి మీ సమయాన్ని మీ శక్తిని వృధా చేయకండి. మీరు ఎంత ప్రయత్నించినా ఎదుటి వ్యక్తి ఎప్పుడూ మారరు. కాబట్టి మీ శక్తిని మరియు సమయాన్ని నీ జీవితాన్ని మార్చుకోవడం మీద పెట్టండి.

4. మీ జీవితంలో మార్పు లేకపోవడానికి ఎదుటి వాళ్లే కారణం అని నిందించకండి. మీ జీవితంలో ఆనందానికి లేదా బాధకి ఎదుటి వ్యక్తి కారణం అని మీరు అంటున్నారంటే మీ మొత్తం శక్తిని వారికి ఇచ్చేసినట్టే. ఇతరులను నిందించడం వలన మీ జీవితం పట్ల మీరు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతారు. కాబట్టి ఇతరులను నిందించడం మానేయండి. మీ జీవితం లో వచ్చిన అపజయాలకు మీరే బాధ్యత తీసుకుని మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోవడానికి ముందడుగు వేయండి.

5. దేవుడిని నమ్మండి కానీ కష్టపడి పనిచేయండి. ఎలాంటి కష్టం లేకుండా రాత్రికి రాత్రి ఏదో ఒక అద్భుతం జరిగి జీవితం మారి పోవాలి అని కోరుకోకండి. మీ విధిని మీరే రాసుకుంటారు. కాబట్టి కష్టంతోనే విజయం సాధ్యం అని తెలుసుకోండి.

మీ జీవితాన్ని ఇప్పటికిప్పుడు మార్చుకోవడానికి ఐదు సూచనలు ఇవి. మీ జీవితంలో ఈ మార్పులు చేసుకోవడం ఈ క్షణమే మొదలు పెట్టండి. ఆలస్యం చేయకండి. మంచి రోజు కోసం లేదా మంచి మంచి సమయం కోసం ఎదురు చూడకండి. ఈ రోజే ఈ క్షణమే మీ జీవితాన్ని మార్చగలదు.

Registration

Forgotten Password?

Loading