మన జీవితాన్ని మార్చే సృష్టి ధర్మాలు

సృష్టి ధర్మాలు
Share

మానవుల ప్రమేయం కొన్ని ప్రకృతి నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు దైవం పెట్టినవి.  ఇవి ప్రతి దేశానికి, ప్రతి వ్యక్తికి, వయసు, నమ్మకాలు, జాతి, మతంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి.  ఇవి ఎల్లప్పుడూ వర్తిస్తాయి. ఈ ప్రకృతి నియమాలు కాలానికి అతీతమైనది.  ఎన్నో మతాలు,  ఎంతోమంది మతగురువులు ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి చెప్తున్నారు.  జీవితంలో ఈ నియమాలు సరిగా పాటించినప్పుడు జీవితం అద్భుతంగా మారుతుంది.  అత్యంత శక్తివంతమైన ప్రకృతి యొక్క ఆ మూడు నియమాలు ఏమిటంటే

  1. కర్మ సిద్ధాంతం
  2. లా ఆఫ్ గివింగ్
  3. గోల్డెన్ రూల్

ఈ 3 నియమాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే.  వీటిని పాటించడం ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా ఎలా మార్చుకోవచ్చునో ఇప్పుడు అర్థం చేసుకుందాం.

భారతదేశంలో చాలా సాధారణంగా వాడే పదం కర్మ.  జీవితంలో ఏదైనా సరిగా జరగనప్పుడు ఇదంతా నా కర్మ అనుకోవడం సర్వసాధారణం.  ఈ కర్మ అనే పదాన్ని నెగిటివ్ పరిస్థితుల్లో వాడతారు.  ఉదాహరణకి దురదృష్టం, ఆరోగ్యం బాగా లేనప్పుడు,  ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాడతారు.  కానీ అసలు కర్మ అంటే ఏమిటి? జీవితాన్ని నడిపించే ఒక అదృశ్య శక్తి కర్మా ? కర్మ విషయంలో మనం ఏమైనా చేయగలమా లేదా కేవలం కర్మ కి కట్టుబడి ఉండడమే నా? కర్మ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.మన చేత చేయబడిన ఏదైనా ఒక పనిని, ఒక మాటని,  ఆలోచనని,  ఎమోషన్ ని కర్మ అంటారు.  ఒక రోజులో మనం చాలా ఎమోషన్స్ ని,  చాలా మాటలని,  ఎన్నో పనులను సృష్టిస్తాం.  ఇవన్నీ కర్మ కిందకే వస్తాయి.  ప్రధానంగా కర్మని రెండు రకాలుగా విభజించవచ్చు.

  1. పాజిటివ్ కర్మ
  2. నెగెటివ్ కర్మ

ఎవరికైనా మంచి చేయడాన్ని పాజిటివ్ కర్మ అంటారు.  ఉదాహరణకి అవసరం ఉన్న వారికి సాయం చేయడం, మన శరీరం గురించి శ్రద్ధ తీసుకోవడం,  ఎదుటి వారితో ప్రేమగా మాట్లాడటం ఇవన్నీ పాజిటివ్ కర్మ కిందకు వస్తాయి.  ఎదుటివారిని గాయపరచడం ఇలాంటివి నెగిటివ్ కర్మ.  ఉదాహరణకి ఒక వ్యక్తిని గాయపరచడం లేదా మోసం చేయడం, భౌతికంగా గాని మాటల తో గాని ఎదుటివారిని హింసించడం,  ఇవన్నీ నెగెటివ్ కర్మ కిందకు వస్తాయి.  ఎల్లప్పుడూ పాజిటివ్  చేయడం ఎవరికీ కుదరదు.  మనిషిగా పుట్టిన తర్వాత పాజిటివ్ కర్మ, నెగెటివ్ కర్మ రెండు చేయడం సర్వ సాధారణం.

కర్మ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.  కర్మ యొక్క పర్యవసానాలు ఏమిటి ?  దీని గురించి అర్థం చేసుకోవడానికి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం. కర్మ సిద్ధాంతం ఏమని చెబుతుందంటే నువ్వు ఏ విత్తనం నాటతావో అదే పంటని కోస్తావ్ అని చెప్తుంది.  నువ్వు మామిడి  విత్తనాలు వేస్తే మామిడి కాయలు వస్తాయి . అదేవిధంగా నువ్వు కాకరకాయ వేస్తే కాకరకాయ వస్తుంది కానీ మామిడికాయలు రావు. కర్మ కూడా ఇలానే పనిచేస్తుంది.  మనం ఏది చేస్తే మనకు తిరిగి వస్తుంది.  ఈ సిద్ధాంతం అన్ని మతాలు అందరూ మతగురువులు ప్రపంచవ్యాప్తంగా బోధిస్తున్నారు.

జీవితాన్ని మార్చే ఈ మూడు ఉప ప్రకృతి నియమాల గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

1. మన ఆలోచనల ద్వారా ఎమోషన్స్ ద్వారా మనం మాట్లాడే మాటల ద్వారా మనం చేసే పనుల ద్వారా మన కర్మని మనమే సృష్టించు కుంటాము.

2. కర్మ ఎంత చిన్నదైనా లేదా పెద్దదైనా దాని పర్యవసనాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మనం పాజిటివ్ కర్మ చేస్తే పాజిటివ్ పర్యవసానాలు, నెగిటివ్ కర్మ చేస్తే నెగిటివ్ పర్యవసానాలు ఉంటాయి.

3. మనం ఒక మామిడి కాయ విత్తనం వేస్తే ఒక మామిడి కాయని కొయ్యం. వందలకొద్దీ మామిడి కాయలు వస్తాయి.  కర్మతో కూడా ఇలానే జరుగుతుంది.  పర్యవసానాలు నెగిటివ్ లేదా  పాజిటివ్ అయినా ఎక్కువగా ఉంటాయి.

4. సమయం: మన విత్తనం వేసిన వెంటనే పండు రాదు. కొంత సమయం పడుతుంది.  కర్మ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది.  మన కర్మ తిరిగి మనకు రావడానికి కొంత సమయం పడుతుంది.

5. కర్మ అనేది మనల్ని శిక్షించడానికి ఉన్నది కాదు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని అద్భుతమైన భవిష్యత్తును సృష్టించడానికి ప్రకృతి మనకు ఇచ్చిన వరం కర్మ.

మన అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం,  సంపద,  ప్రశాంతత కావాలి. ఇవి కావాలంటే అలాంటి విత్తనాలు మనం నాటాలి. కానీ ఎలా? లా ఆఫ్ గివింగ్ ఏం చెబుతుందంటే మనం ఏమి ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనకి ఏం కావాలో అది మనం ఇవ్వాలి. మీకు ప్రేమ కావాలంటే ఎదుటివారిని ప్రేమించడం మొదలు పెట్టండి.  మీకు మంచి ఆరోగ్యం కావాలంటే ఎదుటి వారు ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి సహాయం చేయండి.  ఉదాహరణకి  ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవడానికి  ఆర్థిక స్థితి బాగా లేని వారికి మందుల ఖర్చులు పెట్టుకోవడం,  రక్తదానం చేయడం ఇలాంటివి.. మనకి డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి.

మనం పాజిటివ్ కర్మ చేస్తే అది మనకి మంచి ఆరోగ్యం, ఆనందం, సంపద, మంచి రిలేషన్ షిప్స్,  ప్రశాంతత రూపంలో తిరిగి వస్తుంది. మనం నెగిటివ్ కర్మ చేస్తే అనారోగ్యం రిలేషన్ షిప్ లో సమస్యలు,  ఆర్థిక సమస్యల రూపంలో మనకు తిరిగి వస్తుంది. ఈ కర్మ ఈ జన్మది కావచ్చు లేదా గత జన్మ కావచ్చు. గతంలో చేసిన లేదా గత జన్మలో చేసిన గాని కర్మని మనం అదుపు చేయలేము.  కానీ భవిష్యత్తులో మనం చేసే వాటిని మాత్రం అదుపు చేయగలము.

పాజిటివ్ కర్మ సృష్టించడానికి కొన్ని సూచనలు.

6. ఆర్థిక పరిస్థితి బాగా లేని వారికి డబ్బు దానం చేయండి. ప్రపంచంలోనే అన్ని మతాలు మీ సంపాదనలో పది శాతాన్ని సేవకి ఉపయోగించమని చెబుతున్నాయి. 10 శాతం ఎక్కువ అనిపిస్తే కనీసం ఒక్క శాతం అయినా సేవకి ఉపయోగిస్తూ క్రమంగా పెంచుకుంటూ వెళదాం. అవసరంలో ఉన్నవారికి డబ్బులు దానం చేయడం అనేది అదృష్టాన్ని, సంపదను,  ఆశీర్వాదాలు ఇస్తుంది.

7. వారానికి కనీసం మూడు గంటలైనా ఎదుటి వాళ్ళకి సేవ చేయండి. మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ నేర్పడం లేదా వృద్ధాశ్రమానికి వెళ్లి కాస్త సమయం గడపడం లేదా అనాధాశ్రమం లో పిల్లలకి మీకు వచ్చినవి ఏమైనా ఉచితంగా నేర్పడం, మెడిటేషన్ లాంటివి. మీకు వచ్చినవి ఎదుటి వాళ్ళకి నేర్పి, వారు కూడా ఎదిగేలా చేసే మార్గాన్ని చూడండి.  ఇలా చేస్తే వాళ్ళ జీవితం మెరుగుపడడంతో పాటు మీకు కొత్త అవకాశాలు వస్తాయి.

8. కష్టాల్లో ఉన్న వారి బాగు కోసం ప్రార్థించండి. ప్రార్ధన వల్ల ఏమవుతుంది అని మనలో చాలా మంది అనుకుంటారు.  మనం ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని సామర్ధ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు.  మన ప్రార్థనలు వాళ్లకి ఒక ఒక భరోసా ఇస్తాయి.

1. ప్రపంచ శాంతి కోసం మానవాళికి మేలు కోసం ప్రార్థన చేయండి.

2. కరుణ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి ఇది ఎలా చేయాలో తెలుసుకోవడానికి రిసోర్సెస్ సెక్షన్ చూడండి.

3. ఎదుటి వాళ్ళని కరుణతో,గౌరవంగా చూడండి.

9. ఆనందమైన జీవితానికి పాజిటివ్ కర్మ చాలా ముఖ్యం. దానితోపాటు నెగిటివ్ కర్మని  సృష్టించుకోకుండా ఉండటం కూడా ముఖ్యం.  నెగిటివ్ కర్మ సృష్టించుకోకుండా ఉండటానికి కొన్ని సూచనలు.

1. పక్క వాళ్ళకి రావాల్సిన పేరుని మీరు దొంగిలించకండి.

2. మీ పనుల ద్వారా, మాటల ద్వారా పక్కవాళ్ళకి హాని చేయకండి

3. పైరేటెడ్ సాఫ్ట్ వేర్స్ లేదా పుస్తకాలు, సినిమాలు వాడకండి, చూడకండి. పైరసీ వి ఏవీ వాడకండి.

4. పక్క వాళ్ళ గురించి పుకార్లు చెప్పకండి.

5. ఎవరినీ మోసం చేయకండి.

6. అబద్ధం చెప్పకండి.

10. గోల్డెన్ రూల్ ఏం చెబుతుందంటే, ఎదుటి వారు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అదే మీరు ఎదుటివాళ్ళకి చేయండి.  ఎవరూ  మోసపోవాలని, గాయపడాలనీ  కోరుకోరు.  కాబట్టి ఎవరిని మోసం చేయకండి. ఎవరిని గాయపరచకూడదు.  ప్రతి ఒక్కరూ గౌరవంగా చూడబడాలి అని అనుకుంటారు.  కాబట్టి అందరిని గౌరవించండి.

ప్రకృతి యొక్క అత్యంత శక్తివంతమైన 3 నియమాలు ఇవే.  ఈ మూడు నియమాల మీద ఆధారపడి మన జీవితాన్ని జీవిస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది.  అదృష్టంతో పుట్టానా అనిపిస్తుంది.  ఎప్పుడు సరైన స్థానంలో సరైన సమయంలో ఉంటాము.  ఈ నియమాల యొక్క శక్తి అలాంటిది.  మీ కోరిక కు తగ్గట్టుగా మీ భవిష్యత్తుని సృష్టించడానికి ఈ 3 నియమాలు సహాయపడతాయి.

మీకు నచ్చినట్టుగా మీ భవిష్యత్తు నిర్మించుకోండి.

Registration

Forgotten Password?

Loading