మనకి ఏం కావాలో తెలియనప్పుడు ఏం చెయ్యాలి ?

Share

జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు అసలు మనకి ఏం కావాలో తెలుసుకోవాలి. మనకి ఏం కావాలో స్పష్టంగా  తెలిసినపుడే దానిని సాధించడం కోసం కష్టపడతాం. ఏం కావాలో చాలా చిన్న వయసులోనే స్పష్టంగా ఉన్న ఎంతో మంది విజయం సాధించిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక లక్ష్యంతో ఏదైనా సాధించాలన్న దృఢ సంకల్పంతో వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకి కావలసిన దానిమీద పూర్తి శ్రద్ద పెట్టి పని చేస్తారు. ఆ సంకల్పమే వాళ్ళని నడిపించి విజయవంతమైన వ్యక్తులుగా చేస్తుంది.

కానీ జీవితంలో చాలాసార్లు మనకి ఏం కావాలో తెలీదు. మనం సాధించాలి అని కలగనే అంత ఏది మనల్ని excite చెయ్యదు. ప్రతీ ఒక్కరికీ ఇది అనుభవమే. మనకి ఏం కావాలో తెలియని స్థితి అందరికీ వస్తుంది. ఏది ఎంచుకోవాలో తెలియక ఏది తేలికగా వస్తే అది తీసుకుంటాము.

మనకి ఏం కావాలో తెలియక కుటుంబ సభ్యుల ఒత్తడి వల్ల లేదా ఎవరో చేస్తున్నారనో మన కెరీర్ ఎంచుకుంటాము. కానీ కాలక్రమేణా ఏదోక రోజూ “అసలు జీవితంలో ఏం కావాలి?” అని మనల్ని మనం అడిగే రోజూ వస్తుంది. అప్పుడు మనకి సమాధానం దొరకదు. ఈ ప్రశ్నకి సమాధానం  తెలియక పోవడం చాలా అయోమయంగా ఉంటుంది. ఏదో కోల్పోయిన భావన వస్తుంది. జీవితంలో ఉత్సాహం పోతుంది. కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి ?

మనందరం ఒక లక్ష్యం తోనే ఈ భూమి మీదకి వచ్చాం. మన మైండ్ అలుపు లేకుండా చేసే ఆలోచనలో మన గమ్యాన్ని పోగొట్టుకున్నాం. మన ఎప్పడూ ఇలా ఆలోచిస్తూ ఉంటే అసలు మన మనసు ఏం చెబుతుందో తెలుసుకోలేం. మనకి ఏం కావాలో తెలుసుకోవడానికి విరామం లేకుండా ఆలోచనలు చేసే మన మైండ్ కి విరామం ఇవ్వాలి. ఇలా చెయ్యడం వల్ల అసలు మన మనసు ఏం చెబుతుందో, మనకి నిజంగా ఏం కావాలో తెలుసుకోవచ్చు.

మనకి ఏం కావాలో తెలుసుకోవడానికి సహాయపడే కొన్ని సూచనలు ఈ కింద చూద్దాం.

1. మీ మెడిటేషన్  ప్రయాణం మొదలు పెట్టండి.

మెడిటేషన్ నేర్చుకోవడం సాధన చెయ్యడం చాలా తేలిక. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే, అలుపు లేకుండా మైండ్ చేసే ఆలోచనలకి కాస్త విరామం ఇచ్చి మీ మనసుతో మీరు కనెక్ట్ అవ్వొచ్చు. మెడిటేషన్ వల్ల , మీ మైండ్ కి విరామం ఇచ్చి ఈ modern day distractions అధికమించొచ్చు. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే, రోజులు గడుస్తున్న కొద్దీ మనకి నిజంగా ఏం కావాలో తెలుస్తుంది. ఖచ్చితంగా మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీ మనసు ఏం చెబుతుందో తెలుస్తుంది. మీకు ఏం కావాలో తెలుసుకోవడానికి మెడిటేషన్ చాలా  సహాయపడుతుంది.

2. Awareness తో ఉండండి.

మీరు రకరకాల పనులు చేస్తున్నప్పుడు మీకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది ఏంటో గమనించండి. ఏ పని ఈ ప్రపంచాన్ని, సమయాన్ని మర్చిపోయేలా చేసి మీకు సంతృప్తిని ఇస్తుందో గమనించండి. అలాంటివన్నీ ఒక లిస్ట్  రాసుకోండి. రోజులు గడుస్తున్నకొద్దీ ఒక లిస్ట్ తయారయిన తర్వాత మీకు నచ్చిన దానిని ఎంచుకోండి. అప్పుడు అది మీకు పెద్ద ఇబ్బంది లేకుండానే తేలికగా దొరుకుతుంది. అది జోక్స్ చెప్పడం కావొచ్చు, కార్టూన్స్ వెయ్యడం కావచ్చు, writing, singing,dancing, planning, వంట చెయ్యడం, programming మొదలైనవి. మీరు వచ్చింది మీకు నచ్చిన ఆ పని కోసమే.

3. ప్రకృతిలో సమయం గడపండి.

పచ్చిని ప్రదేశాలలోనూ ఆరుబయట సమయం గడపండి. కాస్త సమయం తీసుకుని క్రమం తప్పకుండా ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. ప్రకృతి అంటే  చాలా దూరంలో ఉన్న అందమైన ప్రదేశమే కానక్కరలేదు మీకు దగ్గరలో ఉన్న పార్క్ అయినా పర్లేదు. ఆ చల్లని గాలిని, ఆకాశాన్ని, పచ్చని చెట్లని, రంగురంగుల పువ్వులని, పక్షులని ఎంజాయ్ చెయ్యండి. మీరు ప్రకృతిలో గడిపినపుడు మీ శరీరం మరియు మైండ్ రిలాక్స్ అవుతుంది. మీతో మీరు కాస్త సమయం గడిపే అవకాశం ఇది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీకు జీవితంలో ఏం కావాలో తెలుస్తుంది.

ఈ మూడు పద్దతులు  మీరు దేనికోసం ఈ భూమి మీదకి వచ్చారో తెలుసుకోవడానికి సహాయ పడతాయి. మీ మైండ్ రిలాక్స్ చేసి మీ మనసు ఏం చెబుతుందో వినడమే సీక్రెట్ ఈ మూడు పద్దతుల్లో మీకు నచ్చిన ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

ఒక్కసారి మీ మనసు ఏం చెబుతుందో తెలుసుకుని మీకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత దానిలో మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. మీకు నచ్చిన దానిలో expert అవ్వడానకి మీ heart and soul పెట్టండి. ఉదాహరణకి మీకు swimming అంటే ఇష్టం అని తెలుసుకుంటే దానిలో best అవ్వడానికి మార్గాలు వెతకండి. దానికి సంబందించిన courses చెయ్యండి. Swimming practice చెయ్యండి. తెలివిగా కష్టపడి మీ నైపుణ్యాన్ని పెంచుకోండి.  వాళ్ళకి నచ్చిన దానిలో నైపుణ్యం ఉన్నవారికి బయట ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనసుకు నచ్చింది చేస్తూ దానిలో the best గా ఉన్నవాళ్ళు దొరకడం చాలా అరుదు.

మనం సాధారణంగా మూడు రకాల మనుషుల్ని చూస్తాం

1. మొదటి రకం.

వీళ్ళు ఏదోక పని చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ అది చెయ్యడం వాళ్ళకి నచ్చదు.  ఎందుకంటే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చింది దానికోసం కాదు కాబట్టి. డబ్బు కోసం మరియు బతకడానికి తప్పక ఆ పని చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి వేరే ఏ అవకాశం లేదు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి నచ్చవు కానీ సౌకర్యం కోసం, డబ్బు కోసం, గౌరవం కోసం సంవత్సరాల తరబడి అదే పని చేస్తూ ఉంటారు.

2. రెండవ రకం.

వీళ్ళు వాళ్ళకి ఏ పని చెయ్యడం ఇష్టమో తెలుసుకుంటారు, కానీ ఆ పని చెయ్యడంలో నైపుణ్యం ఉండదు అంతేకాదు ఆ నైపుణ్యం పెంచుకునే ఉద్దేశ్యం కూడా ఉండదు. వాళ్ళకి అవకాశాలు లేవని పిర్యాదు చేసే వాళ్ళు వీళ్ళే.

3. మూడవ రకం.  

వీళ్ళు వాళ్ళకి ఏ పని చెయ్యడం ఇష్టమో తెలుసుకుని అది చేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని ఒక క్రమ పద్దతిలో పెంచుకుంటారు. ఈ రంగంలో అయినా నైపుణ్యం పుట్టుకతో రాదు. పుట్టుకతో వచ్చిన painter లేదా singer లేదా actor అయినా కానీ ఎన్నో సంవత్సరాల practice తో వాటిలో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఏ టాలెంట్ కి అయినా practice అవసరం. మనం సమయం తీసుకుని కష్టపడాలి. ఈ రకం వ్యక్తులు ప్లాన్ చేసుకుని క్రమ పద్దతిలో వాళ్ళకి నచ్చిన రంగంలో experts లా మారతారు. దీనివల్లనే వాళ్ళు success అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా వారికంటే ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఇలాంటి వారికోసం ప్రపంచం ఎన్నో అవకాశాలతో ఎదురు చూస్తూ ఉంటుంది. సహజంగానే డబ్బు, కీర్తి వారికోసం ఎదురుచూస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ పని చేయాలన్న తపన, అది అద్భుతంగా చేసే నైపుణ్యం ఒకేచోట ఉంటే వారు the best అవుతారు కాబట్టి.

కాబట్టి సమయం తీసుకుని మీ లక్ష్యం  ఏంటో తెలుసుకుని దానిలో the best అవ్వడానికి ఒక ప్లాన్  ప్రకారం కష్టపదండి. ఒక్కటే జీవితం. ఇంత విలువైన జీవితాన్ని ఏదన్నా సాధించాలన్న తపనతో, లక్ష్యం తో బతకండి. ఈ ప్రపంచం మీదే.

మీ లక్ష్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ గొప్ప పుస్తకం చదవండి

Registration

Forgotten Password?

Loading